2014 elections specialities

2014-elections-specialities, nota, Voters photos on slips, Election Commission of India, 2014 general elections in India

2014-elections-specialities, nota, Voters photos on slips

ఈసారి ఎన్నికల నిర్వహణలో విశేషాలు

Posted: 03/05/2014 04:59 PM IST
2014 elections specialities

ఈసారి 2014 ఎన్నికలు కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటున్నాయి.

మొట్ట మొదటిసారిగా నోటా (అభ్యర్థుల తిరస్కరణ వోటు) బటన్ ని ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లలో పొందుపరుస్తున్నారు.  ఏ అభ్యర్థికీ వోటు వెయ్యటం ఇష్టం లని పక్షంలో ఆ తిరస్కరణ బటన్ ని నొక్కి వోటర్లు తమ అభీష్టాన్ని తెలియజేయవచ్చు.  అయితే దాని పర్యవసానమేమిటన్నది ఇంకా నిర్ణయాత్మకంగా తెలియజేయలేదు. 

ఓటర్లకు ఇచ్చే స్లిప్ ల మీద ఓటర్ల ఫొటోలు ముద్రించబడుతున్నాయీసారి.  దానితో దొంగవోట్లకు అవకాశం ఉండదు. 

ఈసారి ఎన్నికల కమిషన్ చేస్తున్న మరో ప్రయోగం ఎలక్ట్రానిక్ డేటాలో పొందుపరచటమే కాకుండా వోటర్ తన వోటుని ఆ బటన్ మీద నొక్కి తెలియజేయగానే పేపర్ మీద పార్టీ పేరు, పార్టీ చిహ్నం ముద్రించబడి పక్కనే ఉన్న పెట్టెలో పడిపోతాయి.  దానితో ఓటర్ కి ఎటువంటి అనుమానమూ లేకుండా ఉంటుంది.  అంతకు ముందు బటన్ నొక్కటమే తెలుసు కానీ లోపల ఏం జరుగుతుందో వోటర్ కి తెలియదు.  అంతే కాకుండా ఓట్ల లెక్కింపును అవసరమైతే చేత్తో కూడా లెక్కించే విధంగా పేపర్ మీద ప్రింట్ అవుతున్నాయి.  కాని ప్రస్తుతం ఆటోమేటిక్ గా లెక్కించే దానితో పోలిస్తే అది చాలా కష్టమైన పని. 

డబ్బు ఎరవేసి వోట్లు కాజేసే అభ్యర్థుల ఆట కట్టించటానికి ఎన్నికల కమిషన్ ఈసారి ఎక్కువ మంది పోలీసులను నిఘాలో పెడుతోంది.  ఒకచోటి నుండి మరోచోటికి డబ్బు రవాణాను ఎలాగూ పోలీసులు అరికడుతూనేవున్నారు. 

వోటర్ చైతన్యం పెరిగి, వోటర్లు కూడా పెరిగిన నేపథ్యెలో ఈసారి సుదీర తీరాలకు చేర్చటానికి అనువుగా లేనిచోట్ల జంతువుల సాయంతో ఎవిఎమ్ లను ఆయా ప్రదేశాలకు చేర్చనున్నారు.  అందులో ఏనుగులు, కంచర గాడిదలు ఉపయోగపడబోతున్నాయి. 

ఈసారి ఎన్నికల షెడ్యూల్ ని తయారు చెయ్యటానికి ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నెలకొన్న వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నారు ఎన్నికల కమిషన్.  రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి గెజెట్ లో ప్రచురితమవనందున ఒకే రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహిస్తున్నా, రెండు ప్రాంతాలకు వేరు వేరు రోజుల్లో మధ్యలో చాలా ఖాళీ సమయం ఉండేట్టుగా ప్రణాళిక చేసింది ఎన్నికల కమిషన్.  తెలంగాణాలో ఏప్రిల్ 30 న ఎన్నికలు జరుగుతుండగా సీమాంధ్రలో వారం తర్వాత మే 7 న ఎన్నికలు జరుగబోతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles