Arvind kejriwal arrested and released in gujarat

Arvind Kejriwal arrested and released in Gujarat, Narendra Modi, Development in Gujarat State, Kejriwal tour in Gujarat, AAP Arvind Kejriwal, Sheila Dikshit

Arvind Kejriwal arrested and released in Gujarat

గుజరాత్ లో కేజ్రీవాల్ అరెస్ట్, విడుదల

Posted: 03/05/2014 04:07 PM IST
Arvind kejriwal arrested and released in gujarat

రోడ్ షోకి అనుమతి లేకుండా ఈ రోజు గుజరాత్ లో నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని గుజరాత్ లో రాఘన్ పూర్ లో అరెస్ట్ చేసారు.  వెనువెంటనే ఆయనను విడుదల చేసారు. 

ఢిల్లీలో అఖండ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా గుజరాత్ లో అడుగుపెట్టిన కేజ్రీవాల్ కి అహ్మదాబాద్ లో ఘనస్వాగతం లభించింది.  అక్కడి నుండి కేజ్రీవాల్ హన్సల్ పూర్ సమీపంలో ఎచ్చవాడ గ్రామంలో మారుతి పరిశ్రమ వస్తున్న చోట భూములను ఇచ్చేసిన రైతులను పరామర్శించటానికి బయలుదేరారు. 

ఆయనతో పాటు పర్యటనకు మనీష్ శిసోడియా, సంజయ్ సింగ్ కూడా వచ్చున్నారు.  వాళ్ళకి అక్కడి ఆఆపా సభ్యులు పార్టీ ఎన్నికల చిహ్నమైన చీపుళ్ళతో ఘనస్వాగతం పలికారు.  ఆఆపుకు మద్దతుగా నినాదాలు చేస్తూ, షీల్ దీక్షిత్ హారీ హై, అబ్ మోదీ కీ బారీ హై (షీలా దీక్షిత్ ని ఓడించారు ఇప్పుడు ఇక మోదీ వంతు) అన్నారు. 

గుజరాత్ లో ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి చేసాం అంటూ తన ప్రసంగాలలో టివి ప్రకటనలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకొస్తున్న దృష్ట్యా ఆ అభివృద్ధేమిటో స్వయంగా చూడాలని గుజరాత్ లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పర్యటన చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles