Bill gates and mukhesh ambani reichest in the world and india

Bill Gates and Mukhesh Ambani reichest in the world and India, Bill Gates net worth 76 billion dollars, Mukhesh Ambani net worth 18.6 billion dollars, Lakshmi Mittal net worth16.7 billion dollars

Bill Gates and Mukhesh Ambani reichest in the world and India

ప్రపంచంలో బిల్ గేట్స్, దేశంలో ముఖేష్ అంబానీ అతి సంపన్నులు

Posted: 03/04/2014 01:04 PM IST
Bill gates and mukhesh ambani reichest in the world and india

ప్రపంచంలోని అత్యధిక ధనవంతులలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి ప్రధమస్థానంలో నిలవగా దేశంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ప్రధమ స్థానాన్ని ఆక్రమించారు.

ఫోర్బ్స్ ప్రతిసంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ మరోసారి ప్రధమ స్థానాన్ని అలంకరించారు.  గత ఇరవై సంవత్సరాల నుంచి అత్యధిక సంపన్నుల జాబితాలో ప్రధమ స్థానంలో ఉంటూ వచ్చిన బిల్ గేట్స్ నాలుగు సంవత్సరాలుగా ఆ స్థానాన్ని టెలికామ్ మొగల్ కార్లోస్ స్లిమ్ హేలుకి ధారాదత్తం చేసి తిరిగి ఈ సంవత్సరం సంపాదించుకున్నారు.  2013లోని 67 బిలియన్ డాలర్ల నుంచి బిల్ గేట్ సంపదలు ఈ సంవత్సరం 76 బిలియన్ డాలర్లకు చేరగా కార్లోస్ స్లిమ్ హేలు 73 నుంచి ఈ సంవత్సరం 72 బిలియన్ డాలర్లకు కిందికి దిగారు.

18.6 బిలియన్ల ఆస్తులతో ప్రపంచ అత్యధిక ధననవంతులలో ముఖేష్ అంబానీ 40 వ స్థానాన్ని ఆక్రమించగా, 16.7 డాలర్ల ఆస్తులుగలిగి దేశంలో రెండవ స్థానంలో ఉన్న లక్ష్మీ మిత్తల్ ప్రపంచంలో 52 వ స్థానంలో ఉన్నారు.  5 బిలియన్ల ఆస్తులు గల అనిల్ అంబానీ దేశంలో 9 వ స్థానంలో ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles