Congress may opt for president rule in ap

centre president ruling, ap state bifurcation, telangana centre on president ruling,

Congress high command is once again looking to impose the President rule in the state.

మరికొన్ని గంటల్లో రాష్ట్రపతి పాలనా ?

Posted: 02/27/2014 07:23 PM IST
Congress may opt for president rule in ap

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడంతో కేంద్రం గత వారం రోజులుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలా ? రాష్ట్రపతి పాలన పెట్టాలా అన్న దాని పై తర్జన భర్జలు పడి చివరకు రాష్ట్రపతి పాలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించిన రంగం అంతా సిద్దం అయినట్లు కూడా డిల్లీ వర్గాల సమాచారం. రేపు అనగా శుక్రవారం ఉదయం 10 గంటల తరువాత కేంద్ర క్యాబినెట్ సమావేశం పై దీని పై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

కిరణ్ రాజీనామా తరువాత సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించినా కాంగ్రెస్ అధిష్టానం తదనంతర పరిణామాలను, ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి పాలన వైపే మొగ్గు చూపిందని అంటున్నారు.

మరోవైపు ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ సైతం రాష్ట్రపతి పాలనపై రేపు కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. దీంతో ఎన్నికల వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేకుండా పోయింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles