Euthanasia petition refered to 5 member constitutional bench by sc

Euthanasia petition refered to 5 member constitutional bench by SC, mercy killing, killing to end pain, Supreme Court of India, Petition for euthanasia

Euthanasia petition refered to 5 member constitutional bench by SC

చనిపోతున్నవారి జీవితాన్ని పొడిగించటమంటే వారి బాధను పొడిగించటమే

Posted: 02/25/2014 02:26 PM IST
Euthanasia petition refered to 5 member constitutional bench by sc

నయంకాని రోగంతో బాధపడేవాళ్ళ జీవితాన్ని పొడిగించటమంటే వాళ్ళ వేదనను పొడిగించటమే నంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ 2008 లో ఫైల్ చేసిన ప్రజాప్రయాజన వ్యాజ్యంలో టెర్మనల్ వ్యాధితో ఇక చనిపోవటం ఖాయం అని వైద్యులు ప్రకటించిన కేసులో వైద్యోపచారాలను నిలిపివేయటానికి అధికారాలనివ్వమని కోరుతూ  సుప్రీం కోర్టుకి వచ్చింది. 

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయమూర్తులు రంజన్ గగోయీ, న్యాయమూర్తి ఎస్ కె సింగ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకొచ్చిన ఈ పిటిషన్ ని వారు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి పంపించింది.  ఎందుకంటే చనిపోవటం ఖాయమన్న కేసులో వారికి కృత్రిమంగా చేసే వైద్యోపచారాలను నిలిపివేయటం విషయంలో లోగడ వచ్చిన తీర్పులన్నీ పరస్పర విరుద్ధంగా భిన్నంగా ఉన్నాయి కాబట్టి. 

ఇది ఆత్మహత్య కిందికే వస్తుంది కాబట్టి, రాజ్యాంగం అందుకు ఒప్పుకోదు కాబట్టి ఈ పిటిషన్ ని వ్యతిరేకిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.  ఈ పిటిషన్ మీద ఆరోగ్య శాఖ, న్యాయ శాఖలకు కూడా సుప్రీం కోర్టు ఈ విషయంలో నోటీసులిచ్చిన మీదట ప్రభుత్వం తరఫునుంచి అందుకు వ్యతిరేకంగానే స్పందన వచ్చింది. 

అందువలన ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం దీని మీద ఇంకా లోతుగా విచారణ చేసి మార్గదర్శకాలను వెలివరుస్తుందని ఈ రోజు త్రిసభ్య ధర్మాసనం తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles