Trs opts for political alliance with congress party

TRS opts for political alliance with congress party, TRS party Chief KCR, KCR son K Taraka Ramarao, TRS merger with congress party, TRS political alliance with congress, Telangana separate state

TRS opts for political alliance with congress party

పొత్తులోనే ఉంది ప్రయోజనం- తెరాస

Posted: 02/25/2014 09:14 AM IST
Trs opts for political alliance with congress party

మేము అన్నమాటకు కట్టుబడివుంటాం.  కాంగ్రెస్ లో విలీనానికి కానీ, పొత్తుకి కానీ మేము తయారే కానీ, నా పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పాలని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఢిల్లీ పెద్దలను అడిగినట్లుగా సమాచారం.  కాంగ్రెస్ నాయకులు మాత్రం కెసిఆర్ తో అవగాహన కుదిరిందని ధీమాను వ్యక్తం చేస్తూ, తెలంగాణా ప్రభుత్వాన్ని నెలకొల్పటంలో కెసిఆర్ ది ప్రధాన పాత్ర ఉంటుందని కూడా అన్నారు.  కాంగ్రెస్ తో విలీనానికే మొగ్గు చూపించారని అంటున్నారు.

అయితే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కంటే తక్కువ స్థాయిని తెరాస పార్టీ వర్గాలు జీర్ణించుకోలేవు.  అంతే కాదు విలీనం, పొత్తులకు వచ్చేటప్పటికి తెరాస లో ఎంతోకాలంగా పనిచేస్తున్నవాళ్ళందరికీ రాజకీయంగా న్యాయం చెయ్యటం కష్టమౌతుంది. 

అందువలన తెరాస నాయకుల స్పందన వేరేలా ఉంది.  మొదటినుంచీ విలీనం పొత్తుల విషయంలో తొందరపడవద్దని కెసిఆర్ ని హెచ్చరిస్తూనేవున్నారు.  టివి ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెసిఆర్ కుమారుడు కె తారకరామారావు విలీనం కంటే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తుకే మొగ్గు చూపిస్తున్నామని అన్నారు.  తెలంగాణా ప్రయోజనాల దృష్ట్యా తెరాస బలమైన శక్తిగా ఎదగటం ఎంతో అవసరమని కెటిఆర్ అన్నారు. 

మాకు అధికారం కాదు కావలసింది, మాకు మా తెలంగాణా కావాలని మాత్రమే కోరుకుంటున్నాం, దానికోసమే పుట్టిన పార్టీ మాది అని తెలంగాణా రాష్ట్ర సమితి గురించి మాట్లాడుతూ వచ్చినా, ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులలో తెరాస తనకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుందన్న ఉద్దేశ్యంతో ఉంది కాబట్టి, విలీనం పొత్తులతో కాంగ్రెస్ కి లాభం చేకూర్చటం అవసరమై అన్న దిశలో కూడా ఆలోచించటం కూడా రాజకీయంగా తప్పేమీ కాదు. 

సుదీర్ఘమైన ఉద్యమం తర్వాత ఉద్యమ లక్ష్యం ప్రత్యక్షరూపంలో తెలంగాణా ప్రజలకు అందాలన్న ఉద్దేశ్యంతో, ఇకముందు కూడా చురుగ్గా రాజకీయాలలో భాగస్వామ్యం వహించాలని అనుకోవటం అసహజమేమీ కాదు.  అందుకోసం ఇతర పార్టీలతో కలవటమా వద్దా అన్నది చూసుకోవటం సబబే అంటున్నారు తెలంగాణా మద్దతుదారులు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles