Telangana achievement claimed by all parties

telangana achievement claimed by all parties, Telangana Congress leaders, Telangana TDP leaders, Telangana Rashtra Samiti, KCR, Sonia Gandhi

telangana achievement claimed by all parties

తెలంగాణా మా ఖాతాలో అంటే మా ఖాతాలో

Posted: 02/25/2014 07:53 AM IST
Telangana achievement claimed by all parties

సోమవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేసారు రాష్ట్ర కేంద్ర కాంగ్రెస్ నాయకులు.  ఇచ్చిన మాట ప్రకారం ఏ అవరోధాలను  లెక్కచెయ్యకుండా తెలంగాణా ఏర్పాటు కోసం చివరివరకూ ధృఢ నిశ్చయంతో నిలిచి తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి బహిరంగంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

ఈ కార్యక్రమంలో జానారెడ్డి, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  కృతజ్ఞతలు తెల్పటంతో పాటు తెలంగాణా కోసం పోరాడిన సమరయోధులను సత్కరించారు.  అందులో నిరంజన్, పురుషోత్తం లు ఉన్నారు.  ఎమ్మెల్సీ ఆమోస్ ను కూడా ఈ సందర్భంగా వేదిక మీద సత్కరించారు కాంగ్రెస్ నాయకులు. 

రేపు 26 న కెసిఆర్ హైద్రాబాద్ వస్తున్న సందర్భంగా ఘనంగా విజయోత్సాహ వేడుకలను చేసుకోవలాని తెరాస పార్టీ నాయకులు సన్నిద్ధమౌతున్నారు.  అయితే విలీనం గురించి కానీ కాంగ్రెస్ తో పొత్తు విషయంలో కానీ ఇంకా ఇదమిద్ధంగా తేలకపోవటం వలన కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది ఇంకా తేలకుండా ఉంది. 

మరోపక్క తెలంగాణా సాధనలో భారతీయ జనతా పార్టీ కృషిని విస్మరిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ సభ్యులు విమర్శిస్తున్నారు.  భాజపా నాయకుడు నాగం జనార్దన రెడ్డి కెసిఆర్ వ్యాఖ్యలను తప్పు పడుతూ, భాజపా లేకుండా తెలంగాణా బిల్లు పాసయ్యేదా అని ప్రశ్నించారు.  ఉభయ సభలలోనూ భాజపా సంపూర్ణమైన మద్దతునివ్వబట్టే తెలంగాణా ఒడ్డెక్కిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనేవున్నారని అన్న నాగం కెసిఆర్ కేవలం సోనియా గాంధీ వలనే తెలంగాణా వచ్చిందంటూ ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేయటం, ఆ మాటను పదే పదే అనటం సరికాదని అన్నారు.

ఇక తెలుగు దేశం పార్టీ ఏమీ తగ్గలేదు.  తెదేపా తెలంగాణాకు మద్దతుగా లేఖనివ్వబట్టే అసలు ప్రక్రియంతా మొదలైందని తెలంగాణా తెదేపా నాయకుడు ఎర్రబల్లి దయాకర్ అన్నారు.  తెలంగాణాను అభివృద్ధి చెయ్యటం తెదేపా వలనే అవుతుందని కూడా ఆయన అన్నారు.  అయితే సీమాంధ్రను సింగపూర్ చేస్తామని కూడా తెదేపా సీమాంధ్రలో చెప్తోందనుకోండి.

ఏతావాతా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావాన్ని తమ ఖాతాలో వేసుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి ఒక కమ్నూనిస్ట్ పార్టీలు తప్ప. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles