Lpg distributors firm on strike plan

LPG strike, cooking gas, All India LPG Distributors Federation, Cooking gas distributors, Gas dealers join strike.

LPG distributors firm on strike plan, Gas dealers join strike

రేపట్నుంచి వంట గ్యాస్ బంద్ ?

Posted: 02/24/2014 08:07 PM IST
Lpg distributors firm on strike plan

గ్యాస్ వినియోగదారులకు మరో  కష్టం వచ్చి పడింది.రేపటి  నుంచి వంట గ్యాస్ అయిపోతే... అంతే సంగతులు! రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ డీలర్లు రేపు ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయనున్నారు. 

దీంతో, అత్యవసరంగా గ్యాస్ కావాలన్నా దొరకని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం, గ్యాస్ సరఫరాకు ఆధార్, బ్యాంక్ ఖాతా అంటూ తిప్పలు పడిన వినియోగదారులకు... ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. గ్యాస్ డీలర్లు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంతో గ్యాస్ సరఫరా నిలిచిపోనుంది. 

గ్యాస్ డీలర్ల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నకోటి 70 లక్షల మంది వినియోగదారులకు సిలిండర్ల సరఫరా ఆగిపోతోంది. గ్యాస్ డీలర్లపై కొత్తగా విధించిన ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేయాలంటూ వారు సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెలో 1170 మంది గ్యాస్ డీలర్లు పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు తెలిపారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles