నాలుగు రోజుల్లో నల్లారి వారి పార్టీ తెరపైకి రాబోతుందనే వార్తలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , కొత్త పార్టీ వైపు అడుగులు వేగం వేస్తున్నారు. కేంద్రంతో సమైక్య యద్దం చేసిన వీరులంత ఒకటై .. సీమాంద్ర లో ‘జై సమైక్య ఆంద్ర పార్టీకి’పురుడు పోయాలని చూస్తున్నారు. దీనిపై నాలుగురోజుల్లో ఒక అధికారి ప్రకటన వస్తుందని అంటున్నారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంద్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఆయన పాటు మంత్రివర్గంలో పని చేసిన నేతలతో కలిసి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర విభజన ఖాయమైపోయింది
త్వరలో గెజిట్ నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో ‘జై సమైక్య ఆంద్రపార్టీ పేరు తో సీమాంద్ర ప్రజల్లోకి వెళ్లటం సమంజసం అనిపించుకోదేమోననే భావన వ్యక్తమైంది. ఇప్పటికే రిజిష్టర్ అయిన కొన్ని పార్టీల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే తుది నిర్ణయంలోనే పార్టీ పేరు ఖారారు చేయాలని నల్లారి గ్యాంగ్ అనుకున్నట్లు సమాచారం.
అయితే నల్లారి తో కలిసి వచ్చే నేతలు ఎవరు అనే దాని పై చర్చలు బలంగా జరుగుతున్నాయి. కొత్త పార్టీ పేడితే ముందుగా వచ్చేవారిలో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నేను కాంగ్రెస్ లోనే ఉంటానని , అందుకే సమావేవశానిిక రాలేనని , విడిగా వచ్చి కలుస్తానని రాయలసీమాకు చెందిన ఒక ఎంపీ చెప్పినట్లు సమాచరం.
ఇక ఎమ్మెల్యేలతో మాట్లాడిన తరువాతే వారిలో ఎవరెవరు తమతో చేతులు కలుపుతారనే విషయం తేలే అవకాశముందని నల్లారి గ్యాంగ్ అంటున్నారు. మొత్తం మీద నాలుగు రోజుల్లో నల్లారి వారి పార్టీ ప్రజల్లోకి రానుంది. ‘‘అయిన దీపం ఉన్నప్పుడు వెలగని ..నల్లారి కిరణాలు ఇప్పుడు కొత్తపార్టీ(దీపం)తో వెలుగుతాయా? ’’ అనే సందేహం సీమాంద్ర ప్రజలకు కలుగుతుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more