Rajyasabha deputy chairman asks mp to shut up

Rajyasabha deputy Chairman asks MP to shut up, MP CM Ramesh, Telangana Bill, KVP Ramachandra Rao, Sujana Chowdhery

Rajyasabha deputy Chairman asks MP to shut up

రాజ్యసభ సభ్యుడిని షటప్ అన్న డెప్యూటీ ఛైర్మన్

Posted: 02/19/2014 02:31 PM IST
Rajyasabha deputy chairman asks mp to shut up

రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఆందోళన చేస్తూ ప్రశ్నిస్తున్న ఎంపీ సిఎమ్ రమేష్ ని షటప్ అనగా ఆయన కూడా యు షటప్ అన్నారు.  రాజ్య సభ సభ్యుడికి మర్యాద ఇవ్వటం మీ ధర్మం అని అనగా నేనేం చెయ్యాలో నాకు తెలుసు యూ ప్లీజ్ షటప్ అన్నారు కురియన్.  రాజీనామా చేసి నిరసన తెలపండని సూచించారాయన.  అయితే సిఎం రమేష్ ముందుగానే తను ఉదయం పేపర్లను లాక్కొనే ప్రయత్నం చేసిన దానిమీద క్షమాపణ కోరారు. 

సభను సజావుగా సాగేట్టుగా చూడాలని, ప్రత్యక్ష ప్రసారాలను కట్ చెయ్యటానికి వీల్లేదని భాజపా నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు.  లోక్ సభలో పాసైన తెలంగాణా బిల్లును యథాతథంగా రాజ్యసభలోనూ పాస్ చేస్తారా అలాంటి ఆదేశాలేమైనా అందాయా అని ఒక రాజ్య సభ సభ్యుడు అడగ్గా, అలాంటిదేమీ లేదని, దాని మీద చర్చ ఉంటుందని, దాన్ని ఆమోదించటం లేదా తిరస్కరించటం సభ్యుల చేతుల్లో ఉందని సవరణలను కూడా ప్రతిపాదించవచ్చని అన్నారు కురియన్.

కెవిపి, సిఎమ్ రమేష్, సుజనా చౌధరి వెల్ లో ఉండి ఆందోళన చేస్తున్నారు.  కావూరి, చిరంజీవ నిలబడి ఆందోళన చెయ్యటంతో రాజ్యసభలో సీమాంధ్ర సభ్యులు ఆందోళన చేస్తుండగా వాళ్ళు మాట్లాడటానికి అనుమతించనని, రాజ్యసభ సభ్యులు కానివారు రాజ్యసభ నుండి బయటకు పోవాలని డెప్యూటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. 

రాజ్యసభను 3 గంటల వరకు వాయిదా వెయ్యటం జరిగింది.  ఈ రోజు 4 గంటలకు రాష్ట్ర విభజన బిల్లు చర్చకు రానుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles