Governor accepts kiran kumar resignation

Governor accepts Kiran Kumar resignation, Kiran Kumar resigns from CM post, Many contestants for CM post, Kiran Kumar rejects temporary CM

Governor accepts Kiran Kumar resignation

కిరణ్ కుమార్ రాజీనామాకి గవర్నర్ ఆమోదం

Posted: 02/19/2014 12:41 PM IST
Governor accepts kiran kumar resignation

చిరంజీవితో సహా అందరూ గుంట దగ్గర నక్కల్లా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తుంటే పెట్టుకున్న ఆదర్శంలో తృణప్రాయంగా  భావిస్తూ ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడం కూడా తనకి ఇష్టం లేదని కిరణ్ కుమార్ గవర్నర్ కి స్పష్టంగా తెలియజేసారు. 

ఒట్టిగా రాజీనామాను సమర్పించటం కాకుండా, ముందుగా మీడియా సమావేశాన్ని నిర్వహించిన కిరణ్ కుమార్ తనెందుకు రాజీనామా చేస్తున్నాన్న విషయాన్ని సందేహాలకు తావు లేకుండా తన ప్రసంగంలో స్పష్టపరిచారు.  ఈ చర్యను తీసుకోవటానికి ముందు మంగళవారం నాడు కిరణ్ కుమార్ ఇతర నాయకులతో కూడా భేటీ అయ్యారు, అందరితోనూ తన ఆలోచనలను పంచుకున్నారు. 

బావిలో పడి ఒకడు ప్రాణాలతో పోరాడుతుంటే, ఆ పంచె నాది అన్నాడట మరొకడు.  ఆలాగే వుంది రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు.  కిరణ్ కుమార్ పోతున్నాడు కాబట్టి ఆ సీటు నాకు దక్కితే బాగుంటుందని ఎదురు చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. 

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడుతూ అంతకంటే దారేముందాయనకి అని వ్యాఖ్యానించారు.  తనకంటూ ఒక అభిప్రాయం లేక అధిష్టానం అడుగులకు మడుగులొత్తే షిండే లాంటి వాళ్ళకి అంతకంటే ఏముంటుంది మాట్లాడటానికి అంటూ రాజకీయ విమర్శకులు అంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles