Private bus catches fire in kadapa district

Private bus catches fire in Kadapa district, passengers are safe, Bus fire in Kadapa district, Suvarnamukhi travels bus catches fire, Suvarnamukhi travels Bangalore

Private bus catches fire in Kadapa district, passengers are safe

ప్రైవేట్ బస్సు దగ్ధం, ప్రయాణీకులు సురక్షితం

Posted: 02/16/2014 10:15 AM IST
Private bus catches fire in kadapa district

కడప జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు సమీపంలో కర్నాటకకు చెందిన సువర్ణ ముఖి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.  కానీ ముందుగానే ప్రమాదాన్ని గమనించటంతో ప్రయాణీకులు, బస్సు సిబ్బంది సురక్షితంగా వేరే బస్సులో గమ్యస్థానాలకు చేరుకున్నారు.  

రోడ్డు పక్కన ఆగివున్న మోటార్ సైకిల్ ని ఢీకొన్న ఆ బస్సు ఆ మోటార్ సైకిల్ ని కొంతదూరం వరకు లాక్కుని పోవటంతో అందులోంచి నిప్పు రవ్వలు లేచి బస్సుకి అంటుకున్నాయి.  అది గమనించిన డ్రైవర్ బస్సుని నిలిపి ప్రయాణీకులనందరినీ సురక్షితంగా కిందికి దించటంతో ప్రమాదం తప్పింది.  

బస్ డ్రైవర్ మీద కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మోటార్ సైకిల్ ని ఢీకొనటం వలనే అగ్ని ప్రమాదం జరిగింది.  అగ్ని మాపక దళాలు ఆదుకోకముందే బస్సు పూర్తిగా తగలబడిపోయి గుర్తుపట్టలేకుండా తయారైంది.  

రిజిస్ట్రేషన్ నంబర్ KA 05 AB 4512 గల ఈ బస్సు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు వెళ్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles