Rishi prabhakar passed away

Rishi Prabhakar passed away, Rishi Prabhakar death, Siddha Samadhi Yoga, SSY Gurukulam, SSY Ashrams, Maralwadi SSY Ashram

Rishi Prabhakar passed away, Siddha Samadhi Yoga

అస్తమించిన ఆధ్యాత్మిక జ్యోతి ఋషి ప్రభాకర్

Posted: 02/16/2014 09:56 AM IST
Rishi prabhakar passed away

సిద్ధ సమాధి యోగా సంస్థాపకులు ఋషి ప్రభాకర్ కన్ను మూసారు.

బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన ప్రభాకర్ ఎయిరోనాటికల్ ఇంజినీర్ కోర్సును ఒట్టావా విశ్వవిద్యాలయం నుంచి, ఆ తర్వాత ఎమ్ బి ఏ ని కెనడాలోని పశ్చిమ ఓన్టారియో విశ్వవిద్యాలయం నుంచి చేసారు. 

తన గురువులైన విశ్వేశ్వరయ్య, మహర్షి మహేష్ యోగి బోధనలకు ఆకర్షితులైన ఋషి ప్రభాకర్ తన స్వస్థలం బెంగళూరుకి వచ్చి సిద్ధ సమాధి యోగ తరగతులను రూపొందించి స్వయంగా బోధించి, కేవలం ఆహార నియమాలు యోగాలతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటమే కాకుండా మానసిక ప్రశాంతతను పొందుతూ సమాజంలో అందరితో కలిసిమెలిసి ఎలా జీవించాలన్న విషయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి ఆచరింప జేసారు.  కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లలో ఆశ్రమాలు స్థాపించి లక్షలాది మందికి మార్గదర్శనం చేసారు. 

చెప్పేది సనాతన ధర్మానుసారమైనా ఋషి సంస్కృతికి ఆధునిక విధానంలో బీజం వేసినా ఆచరణ సులభమైన నియమాలను ప్రత్యక్షంగా అందరిచేతా ఆచరింపజేసి ఫలితాలను ఎవరికి వారు తెలుసుకునేట్టుగా చేసారు.  దానితో పాటు నియమ నిష్టలతో సిద్ధసమాధి యోగా విధానంలో విద్యాబోధన చెయ్యటానికి అధ్యాపకులను తయారు చేసారు. 

ఆధ్యాత్మిక సాధనంటే ఏదో గొప్ప విషయాలను తెలుసుకుని అందరికంటే జ్ఞానవంతులమని అనుకోవటం కాకుండా ప్రేమ, సత్సంబంధాలతో కలిసిమెలిసి సమాజంలో జీవించటమని తేలికైన భాషలో, పండితులకు పామరులకూ వర్తిస్తుందని, జీవితాన్ని సుఖప్రదంగా చేసుకోవటం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రత్యక్షానుభవం ద్వారా తెలుసుకునేట్టుగా చేసారు.  ఆధ్యాత్మికానికి సరికొత్త నిర్వచనం ఇస్తూనే హిందూ సనాతన ధర్మాలను కాపాడుకునే దిశగా ఎలా పాటుపడాలో నేర్పారు.  అలాగని వెనకబడిపోయి ఉండటం కాకుండా శిశువుల మేథస్సుని పెంచే విధానం, కంప్యూటర్ ఇంటర్ నెట్ ల ఉపయోగం లాంటి అంశాలను కూడా అభివృద్ధి చేసారు. 

కేవలం బ్రహ్మజ్ఞానం బడసే మార్గాన్ని చూపించటమే కాకుండా మనిషికి మౌలికంగా అవసరమైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ నిత్యా అన్నదానాలు, సామూహిక వివాహాలు నిర్వహించటమే కాకుండా, త్యాగనిరతి, ఇతరులకు సాయం చెయ్యటమే గుణాలను అభ్యాసకులు సొంతం చేసుకునేట్టుగా చేసారు.  శిశు మానసిక అభివృద్ధి కోసం కార్యక్రమాలు, పిల్లలకోసం గురుకులాలను స్థాపించారు. 

అన్నా హజారే గురించి గత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అందరికీ తెలిసింది.  కానీ సిద్ధ సమాధి యోగా తరగతులలో అన్నా హజరే ఏ విధంగా తన గ్రామాన్ని స్వయంసమృద్ధిగా చేసారన్నదాన్ని 15 సంవత్సరాల క్రితమే వివరించారు ఋషి ప్రభాకర్. 

ఈరోజు ఉదయం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఋషి ప్రభాకర్ కన్నుమూసిన వార్త తెలియగానే లక్షలలో ఉన్న ఆయన శిష్యులు, వేలాదిగా ఉన్న అధ్యాపకులు శోకతప్తులయ్యారు.  ఆయన అంత్యక్రియలను రేపు బెంగళూరులో జరుపనున్నారు.

ఋషి ప్రభాకర్ బోధించటమే కాకుండా స్వయంగా ఆచరించి చూపిన విషయాలెన్నో ఉన్నాయి వాటి మీద ప్రత్యక వ్యాసం ఈ వెబ్ సైట్ లో రాబోతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles