మా ప్రాంతానికి న్యాయం చెయ్యలేనప్పుడు మాకు ప్రత్యేక పార్లమెంటే ఇవ్వండి ప్రత్యేక దేశంగా విడిపోతాం అంటూ సీమాంధ్ర తెలుగుదేశం ఎంపీలు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసారు. బాధితులనే సస్పెండ్ చెయ్యటమేమిటని ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
స్పీకర్ వెల్ లోకి వెళ్ళిన 57 మంది ఎంపీలలో 41 మందిని వదిలేసారు, 16 మందిని వెలివేసారు ఇదెక్కడి న్యాయమంటూ తెదేపా ఎంపీలు మోదుగుల వేణుగోపాల రెడ్డి, సుజనా చౌధరి, సిఎం రమేష్ లు ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం చేసిన ఎంపీలను సస్పెండ్ చెయ్యటం ప్రజాస్వామ్యమా అని కూడా వాళ్ళు అడిగారు. ఇలా వైఫల్యం పొందిన పార్లమెంట్ కంటే మా రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వండి మాకో పార్లమెంట్ ఇవ్వండి మా 25 స్థానాలనూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లా విడదీయండి అంటూ వేణుగోపాల్ రెడ్డి ఆవేశపూరితంగా అన్నారు.
భాజపా నేత సుష్మా స్వరాజ్ తో పాటు అందరూ బిల్లు పెట్టలేదని అంటుంటే విభజన బిల్లుని ప్రవేశపెట్టానని కేంద్రం అనటమేమిటి అన్నారు వేణుగోపాల్ రెడ్డి. వీడియో ఫుటేజ్ ని బహిర్గతం చెయ్యండి. నేను నిజంగానే కత్తి తీసుకుని సభ్యులను బెదిరించి వుంటే నన్ను ఉరితీయండి అన్నారాయన.
పార్లమెంటులో ఆత్మరక్షణకు స్ప్రే వాడవలసి రావటం దురదృష్టకరం. అందుకు బాధ్యులను తప్పు పట్టాలి కానీ బాధితులను కాదు అన్నారు వేణుగోపాల్ రెడ్డి. స్పీకర్ లు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా పనిచేస్తున్నారని, వాళ్ళకి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిస్తామని కూడా ఆయన అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more