Bjp says still time to amendments in t bill

bjp says still time to amendments in T bill, Arun Jaitley, AP State Reorganization Bill 2013, Telugu Desam Party, Justice to Seemandhra Aru Jaitley

Still time for amendments in T bill says BJP, Arun Jaitley

ఇప్పటికీ ఏం కాలే సవరణలు చెయ్యండి - భాజపా

Posted: 02/15/2014 09:04 AM IST
Bjp says still time to amendments in t bill

ఇప్పటికైనా ఏం ముంచుకుపోలేదు ఇంకా సమయం ఉంది ముందుగా రాష్ట్ర విభజన బిల్లులో అవసరమైన సవరణలు చెయ్యండి.  సీమాంధ్రులకు న్యాయం చెయ్యండి.  మీరు తయారు చేసిన బిల్లులో విభజన వలన ఏర్పడే సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించలేదు- అన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ. 

భాజపా మొట్టమొదటిసారిగా విభజన విషయంలో వెల్లడిచేసిన పార్టీ వైఖరిలో ఈ విషయాల మీద స్పష్టత కావాలని చెప్పటం జరిగింది- సీమాంధ్ర రాజధాని, సీమాంధ్ర హైకోర్టు, విభజన వలన నష్టపోతున్న ఆదాయాన్ని ప్రత్యామ్నాయం, నీరు కరెంటు పంపిణీలల భాగస్వామ్యం మొదలైనవి.

రాష్ట్ర విభజన బిల్లు మీద భాజపా నాయకులు వివిధ రకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యటంతో అటు సీమాంధ్రలోనూ ఇటు తెలంగాణా లోనూ విమర్శలు ఎదుర్కుంటున్నారు.  అందువలన తమ వైఖరిని భాజపా చాలా స్పష్టంగా ఈ విధంగా తెలియజేసిందనుకోవచ్చు. 

మేము తెలంగాణాకు వ్యతిరేకులము కాము అంటూ మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తోంది భాజపా అయినా కాంగ్రెస్ పార్టీ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి బిల్లు ఆగిపోతే, చూసారా అంతా భాజపా వలనే జరిగింది అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగూడదన్నది భాజపా ఉద్దేశ్యం.  బిల్లు మేం పెట్టకపోతే దాని ఘనతంతా భాజపాకు దక్కుతుందేమో తెలంగాణాను ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలన్నిద కాంగ్రెస్ తపన. 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడకపోతే మనుగడ లేదనే ఉద్దేశ్యాన్ని తెలంగాణా ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయేట్టు నాయకులు చెయ్యటం వలన, తెలంగాణా కోసం పోరాడకపోతే తెలంగాణా ప్రజలు ఆదరించరనే భావనతోనూ అన్ని పార్టీలలోనూ విభజన ఏర్పడి తెలంగాణా సీమాంధ్రగా ఏర్పడ్డాయి. 

ఇలాంటి తరుణంలో ప్రతి పార్టీ చేసినట్లుగానే భాజపా కూడా తెలంగాణాకు వ్యతిరేకం కాదని, కాకపోతే సీమాంధ్ర ప్రజలకు న్యాయం చెయ్యటం అవసరమని చెప్తోంది.  తెలుగు దేశం పార్టీ కూడా ఇదే వైఖరిని అవలంబిస్తోంది.  అయినా తెలంగాణా నాయకులు ముఖ్యంగా తెరాసా పార్టీ నాయకుల విమర్శలను ఎదుర్కుంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles