Modi chaivala versus rahul hair cutters

Modi Chaivala versus Rahul hair cutters, Narendra Modi, Rahul Gandhi, Modi Video conference with chayvalas, Rahul supports hair cutters

Modi Chaivala versus Rahul hair cutters, Narendra Modi, Rahul Gandhi

మోదీ చాయ్ వాలాకు పోటీగా రాహుల్ క్షౌరశాల

Posted: 02/11/2014 09:25 AM IST
Modi chaivala versus rahul hair cutters

దేశవ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసుల్లో ఉన్నట్టుండి టీ దుకాణాలకు లైసెన్స్ లకు దరఖాస్తులు వస్తున్నాయి.  దానితో పాటు చాయ్ బండ్లను తయారు చేసేవాళ్ళకి, టీ పొడి అమ్మేవాళ్ళకి, పాలు సరఫరా చేసేవాళ్ళకి కూడా గిరాకీ బాగా పెరిగింది.  కమర్షియల్ గ్యాస్ కోసం అప్లై చేస్తున్నవారు కొందరైతే మన రాహుల్ బాబు 12 సిలెండర్లు ఇస్తున్నారుగా వాటిని ఉపయోగించుకుని టీ దుకాణం పెట్టుకుందామనే ఆలోచనలో మరి కొందరున్నారు. 

ఉన్నట్టుండి టీ వినియోగదారులు అంతగా పెరిగిపోయారా అంటే కాదు మన కాబోయే ప్రధానమంత్రి టీ దుకాణాలకు మద్దతిస్తారట అని కొందరు, ఏవేవో రాయితీలు వస్తాయట అని మరికొందరు ఆశాభావాలను వ్యక్తపరుస్తున్నారు. 

ఎవరు రాహుల్ గాంధీయా అంటే కాదెహే, నరేంద్ర మోడీ అన్నారు కాస్త లోకజ్ఞానం ఎక్కువున్నవాళ్ళు. 

రేపు దేశవ్యాప్తంగా అందరు చాయ్ వాలాలతోనూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారన్న వార్త దావానంలో వ్యాపించటమే అందుకు కారణం.  ఆయనతో మాట్లాడటానికి అందరూ చకచకా అర్హతలను సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.  ఆ అర్హతేమిటంటే టీ దుకాణం యజమాని అయ్యుండటం. 

చాయ్ దుకాణాలు, క్షౌరశాలలు ఈ రెండూ రాజకీయాలు మాట్లాడుకోవటానికి అనువైన స్థలాలు కాబట్టి క్షౌరశాలలను నిర్వహించేవాళ్ళకోసం పిలుపనిస్తే ఎలా ఉంటుందా అని రాహుల్ మద్దతుదారులు ఆలోచిస్తున్నారు.  రెండు రోజులలో క్షౌరశాలల యజమానులతో రాహుల్ గాంధీ వీడియా కాన్ఫరెన్స్ లో చర్చిస్తారనే వార్త కూడా ఊపందుకుంది.  దానితో గబగబా క్షౌరశాలలు కొత్తగా వెలుస్తాయని ఎదురు చూసారు కానీ అలా జరగలేదు. 

అందుకు కారణం ఏమైయ్యుంటుందా అని విచారిస్తే,  క్షౌరశాలలకు పెట్టుబడి ఎక్కువ కావలసివస్తోంది.  చాయ్ దుకాణాల్లాగా ఎక్కడబడితే అక్కడ పెట్టటానికి వీలుగా ఉండదు.  మరో సమస్య పనిచేసేవాళ్ళు చాయ్ దుకాణాల్లో దొరికినంత సులభంగా దొరకరు, పైగా వాళ్ళకి శిక్షణ కూడా అవసరం అని తెలిసింది.

సరే, మోదీగారంటే ఆయన తండ్రిగారు టీ దుకాణం నడిపి రైళ్ళలో సప్లై చేసేవారట, ఆయన కొడుకుగా మోదీ కూడా చేదోడుగా నిలిచారట చిన్నప్పుడు.  (అప్పుడు బాలకార్మికుల చట్టం అమలులో లేదు లెండి)  మరి రాహుల్ గాంధీకి, క్షౌరశాలకీ ఏ విధమైన సంబంధాన్ని కలిగించాలా అని ఆలోచించారు పార్టీ యువనాయకులంతా.

కటింగ్ చెయ్యకపోయినా కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చేసేది అదేనని అంటే ఎలా ఉంటుంది అని ఒక బుడ్డి యువ నాయకుడు తన బుర్రలో మెరుపులా వచ్చిన ఆలోచనను బయటపెట్టాడు.  ఛండాలంగా ఉంటుంది అని ఒక సీనియర్ యువనాయకుడు ఆ ప్రతిపాదనను గట్టిగా ఖండించాడు.  కట్ చెయ్యటం గుండె గీయటం అనేదానికి తెలుగు వాడకంలో గౌరవంగా ఉపయోగించరు.  తిరుపతి లో క్షౌరం చేసేవాళ్ళని కూడా విమర్శిస్తుంటారు అని మిగిలినవాళ్ళు ఆ బుడ్డోడికి వివరించారు.

మోదీని చూసి రాహుల్ గడ్డం పెంచుకున్నట్లువుతుందన్నారందరూ పులిని చూసి నక్క వాతపెట్టుకుందన్న శైలిలో!

ఆగండాగండి, ఇంతకీ మోదీ కాన్ఫరెన్స్ దేశమంతా కాదట కేవలం బీహార్ లోనేనట.  బీహార్ లోని 15 జిల్లాలలో చాయ్ వాలాలతో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మోదీగారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందట అన్నాడు వార్తను పూర్తిగా చదివిన టీ దుకాణాల సంఘానికి అధ్యక్షుడు. 

అందుకు స్మార్ట్ ఫోన్లను సప్లై చేస్తున్నట్టున్నారు వాళ్ళందరికీ అన్నాడు ఆ అవకాశం పొగొట్టుకుంటున్నందుకు బాధపడుతూ ఒక తెలుగు చాయ్ వాలా.

Previous Gali Vartha

Previous Gali Vartha

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles