Government views through president comments

President Pranab Mukherjee, Indian Government, AP State reorganization bill, Bills pending in Parliament, Bills to pass before elections

Government Views through President comments, state reorganization bill

రాష్ట్రపతి మాటల్లో ప్రస్ఫుటమయ్యే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు

Posted: 02/11/2014 08:04 AM IST
Government views through president comments

కేంద్ర ప్రభుత్వం మనమాట వినకపోయినా అందరికీ పెద్ద రాష్ట్రపతి ఉన్నారులే అని భావించారో లేకపోతే దాన్ని నమ్మినట్టుగా నటించారో కానీ రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేకంగా రాష్ట్రపతికి వినతి పత్రాలందించినవారంతా బయటకు వచ్చి తాము చెప్పిందంతా ఆయన ఎంతో ఓపిగ్గా విన్నారని, తనకు చేతనైనంత న్యాయం చేస్తానని వాగ్దానం చేసారని తప్పకుండా ఆయన తన పరిధిలో సీమాంధ్రకు న్యాయం చేస్తారని చెప్పుకున్నారు.  కానీ ముహూర్తం ముందే పెట్టుకుని కూర్చున్న కేంద్ర ప్రభుత్వం మిగిలిన తంతులన్నిటినీ పకడ్బందీగా తయారు చేసుకుని పెట్టుకుంటున్నదని ఆఘమేఘాల మీద ఆమోద ముద్ర వేసుకుని రాష్ట్రపతి దగ్గర్నుంచి బంతిలా తిరిగివచ్చిన బిల్లుతో అర్థమౌతోంది. 

అంతే కాదు, బిల్లులను పాస్ చేయించటానికి కేంద్ర ప్రభుత్వం విపక్షాలను ఎలా ఒప్పించాలా ఏ విధంగా పాస్ చేయించుకోవాలా అనే వ్యూహాలు పన్నుతోంది కానీ ఈ విషయంలో రాష్ట్రపతి సహాయ సహకారాల గురించి ఎటువంటి అనుమానాలూ లేనట్టుగానే కనిపిస్తోంది. 

పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ ప్రెసిడెంట్లు, లోక్ సభ స్పీకర్ల ఛాయాచిత్రాలను ఆవిష్కరించిన రాష్ట్రపతి ఆ తర్వాత తన ఉపన్యాసంలో పార్లమెంట్ లో సభ్యులు సంయమనాన్ని పాటించాలని, పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని కోరారు.  చర్చలు, నిర్ణయాల ద్వారా పార్లమెంట్ పని చేయాలి కానీ ఆటంకాలు కలిగే విధంగా ప్రవర్తించగూడదని ఆయన అన్నారు. 

బిలియన్ కి అధిక సంఖ్యలో ఉన్న ప్రజా వాణిని పార్లమెంట్ లోకి తీసుకుని రావటమంటే అది యావద్భారత ప్రజానీకానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వారధి అంటూ ఉపమానంగా గంగోత్రి కలుషితమైనట్లయితే గంగ దాని ఉపనదులు కలుషితం కాక మానవని అన్నారు రాష్ట్రపతి.  పార్లమెంట్ సభ్యులందరూ గౌరవప్రదమైన వారి స్థాయిలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ పార్లమెంట్ సభలను సజావుగా సాగేందుకు దోహదం చెయ్యాల్సివుంటుందని రాష్ట్రపతి తెలియజేసారు.

కాంగ్రెస్ పాలిత యుపిఏ ప్రభుత్వం ఎన్నికల లోపులో జరుగుతున్న ఈ ఆఖరు సభాసమావేశాలలో వీలయినన్ని ఎక్కువ బిల్లులను పాస్ చేసే పనిలో పడింది.  అందులో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి చేసిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ఒకటి.  రాష్ట్ర పతి మాట్లాడిన సందర్భాలు తక్కువే అయినా మాట్లాడిన ప్రతిసారీ ప్రభుత్వం కోరుకుంటున్నదానికి ఆయన పూర్తి మద్దతు కనిపిస్తోంది. 

ప్రస్తుతమున్న తక్కువ సమయంలో మేము చేసాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవటానికి వీలున్న బిల్లుల మీద ఆమోద ముద్ర వేయించుకోవాలనుకుంటున్న సందర్భంలో రాష్ట్రపతి సూచనలు విశేషతను సంతరించుకుంటున్నాయి.  ఆయన హైద్రాబాద్ విడిదికి వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్ర విభజనలు అవసరమైనని, పెరుగుతున్న జనాభా దృష్టిలో రాష్ట్రాలు విడిపోకుండా అలాగే ఉండటం సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానించారు.  ఈ విధంగా పరోక్షంగా రాష్ట్రపతి మాటల్లో కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నదేమిటో అందరికీ అర్థమయ్యేట్టు, దానికి తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పకనే చెప్పటం జరుగుతోంది.

అయితే ఆయన మీద గంపెడాశ పెట్టుకుని, బిల్లుకి రాష్ట్రపతి కార్యాలయం ఆఖరు అడ్డంకి అవుతుందేమోనని ఆశించిన సీమాంధ్ర నాయకులు భంగపడ్డారు.  జరుగుతున్న వ్యవహారమంతా చూస్తుంటే రాష్ట్రపతికి వినతి పత్రాలందించినవారంతా, రాష్ట్రపతి తప్పకుండా వాటి మీద దృష్టి సారించి బిల్లును రాజ్యసభకు పంపించకుండా ఉంటారని అనుకున్ననాయకులంతా అనవసరంగా వృధా ప్రయాస పడ్డాం కానీ కేంద్రం అనుకుంది అనుకున్నట్టుగా చేస్తుందనే అభిప్రాయం కలిగి చేష్టలుడిగి ఉన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles