Telangana mantris to boycott todays cabinet meet

Telangana Bill, AP reorganisation bill, Telangana, Seemandhra, telangana mantris, telangana mantris to boycott, cabinet meeting, cm kinra kumar reddy, Samaikyandhra, Andhra Pradesh bifurcation, Andhra Pradesh Assembly, AP budget

telangana mantris to boycott todays cabinet meet

సమయం చూసి సిఎంకు హ్యాండించారు

Posted: 02/10/2014 11:33 AM IST
Telangana mantris to boycott todays cabinet meet

మంచి సమయం  రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ..తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు  హ్యాండించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగిన కేబినేట్ సమావేశాన్ని తెలంగాణ మంత్రులు బైకాట్ చేశారు. 

సమావేశం జరుగుతున్న సమావేశంలో మంత్రి జానారెడ్డి నివాసంలో సమావేశమయి మంతనాలు జరిపారు. టీ-బిల్లుపై అసెంబ్లీలో తిరస్కార తీర్మాణం, విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో చేపట్టిన దీక్షకు నిరసనగా టీ-మంత్రులు ఈ బైకాట్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీ-మంత్రులు లేకుండానే జరిగిన కేబినేట్ మీటింగ్ ఓటాన్ అకౌంట్ కు ఆమోదముద్ర వేసింది. తెలంగాణ మంత్రులు కేబినేట్ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై పీసీసీ ఛీప్ బొత్స ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఓటాన్ అకౌంట్ పై నిరసన తెలపడం సమజసం కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. విభజన విషయంలో.. నేతలు ఇప్పటికే ప్రాంతాల వారీగా విడిపోయారు. తాజాగా, కేబినెట్ భేటీని టీ-మంత్రులు భైకాట్ చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర రాజకీయాలు మరింత వేడేక్కాయి.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles