Congress never announces pm candidate before elections

Congress PM candidate announcement, PM candidate Rahul Gandhi Congress Vice President Rahul Gandhi,

Congress never announces PM candidate before elections says Rahul Gandhi

ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ మాకు లేదు- రాహుల్ గాంధీ

Posted: 02/08/2014 11:11 AM IST
Congress never announces pm candidate before elections

అమ్మాయికి పెళ్ళి చూపులు!  వరుడు నచ్చలేదనుకోండి ఆ విషయం గట్టిగా చెప్పేస్తుంది ఆ అమ్మాయి.  నచ్చాడనుకోండి!  నచ్చాడని చెప్పదు.  మీ ఇష్టం నాన్నా అంటుంది. 

రాహుల్ గాంధీ కూడా అలాగే చేసారు.  తనకి నచ్చని గవర్నమెంట్ ఆర్డినెన్స్ మీద వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు.  కానీ ప్రధానమంత్రి పదవి మాట వచ్చేసరికి అందరూ ఏం చెప్తే అది అంటున్నారాయన.  ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎంపీలంతా తనే ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటే తనకు సమ్మతమేనని మనసులో మాటను బయటపెట్టేసారు రాహుల్ గాంధీ జార్ఖండ్ పిసిసి సీనియర్ నాయకుల సమక్షంలో. 

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారసారధిగా పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ, తనను కాంగ్రెస్ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అని పిలవటం తనకి ఇష్టం లేదని అన్నారు.  కాంగ్రెస్ పార్టీకి అలా ఎన్నికల ముందుగానే ప్రధాన మంత్రి అభ్యర్థినికానీ ముఖ్యమంత్రులను కానీ ప్రకటించే ఆనవాయితీ లేదని కూడా రాహుల్ గాంధీ అన్నారు. 

పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించకముందే మీడియా అంతా భాజపా అభ్యర్థి నరేంద్ర మోదీతో పోల్చటం మొదలుపెట్టింది.  ఇక ప్రకటనే చేస్తే రకరకాల విమర్శలు వచ్చి ప్రజలలో ముందుగానే తప్పు సంకేతాలు వెళ్ళే అవకాశం ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యంబేలా అన్నట్లు టివిల్లోనూ ఇతర ప్రచార సాధనాలలోనూ రాహుల్ గాంధీని నాయకుడిగా చెప్తూ ప్రచారం జరుగుతూనేవుంది.  పైగా వంట గ్యాస్ సిలెండర్లను రాయితీలో సంవత్సరానికి 9 నుంచి 12 కి పెంచమని ఆయన చేసిన సలహా అమలులోకి వచ్చేస్తోంది కూడా. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని దాన్ని పూరించటం ఎంతో అవసరమని కూడా కాంగ్రెస్ పార్టీ అప్రకటిత ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అన్నారు.

ఈరోజు రాహుల్ గాంధీ మోదీ కంచుకోట గుజరాత్ ని భేదించటానికి సిద్ధమౌతున్నారు.  ఆయన ఎన్నికల ప్రచారం గుజరాత్ లో జరుగనుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles