Woman in colorado bresstfeeds puppy

woman in Colorado breast feeds new born puppy, Coloradao woman breast feeds, new born puppy breastfed, breast feedin animals not good, Doctors warn against breastfeeding pet animals

woman in Colorado breast feeds new born puppy

జంతు ప్రేమతో తన పాలిచ్చి ప్రాణాలు కాపాడిన మహిళ

Posted: 02/08/2014 10:25 AM IST
Woman in colorado bresstfeeds puppy

చిన్న కుక్కపిల్ల పాలసీసాతో తాగలేక, నోటితో తినలేక ఆకలితో అవస్తపడుతూ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మృత్యువుకి దగ్గరగా పోతుంటే చూసి తట్టుకోలేక ఒక తల్లి తన పాలనిచ్చి ఆ కుక్కపిల్ల ప్రాణాలను కాపాడిన ఉదంతం కొలారెడోలో జరిగింది. 

తన గురించిన వివరాలను గుప్తంగా ఉంచమని కోరిన ఆ మహిళ తాను పాలు ఇస్తున్నప్పుడు తీసిన ఫొటోని వెబ్ లో పెట్టగా దాన్ని చాలా మంది తిలకించారు. 

ఆ కుక్కపిల్లను ముద్దుగా టబ్ అని పిలుస్తూ, తను చేసిన పనిని తాను తప్పుగా భావించటం లేదని, అలా చెయ్యటం వలన టబ్ బ్రతికిందని ఆనందంగా చెప్తుందామె. 

అయితే అలా మనిషి జంతువుకి పాలివ్వటం సరికాదని, ఆ పాలు కేవలం మనుషులకే పనికివస్తాయని చెప్తూ, అలా చెయ్యటం వలన తన పిల్లల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉందంటున్నారు చిన్నపిల్లల డాక్టర్లు.  ఈ విషయంలో తను పాలిచ్చింది ఒక్కసారే నని, పైగా తన కూతురికి ఇప్పుడు 15 మాసాలు నిండటం వలన తను పాలు ఇవ్వటం మానేసాను కాబట్టి ఎటువంటి నష్టమూ వాటిల్లది ఆమె అంటోంది.

జీవకారుణ్యం మనిషికి మంచిదే కానీ ఇలాంటి విడ్డూరమైన పనులను చెయ్యగూడదని విశేషజ్ఞలు హెచ్చరిస్తున్నారు.  కానీ ఆమె నెట్ లో పోస్ట్ చేసిన ఫొటోకి మాత్రం విశేష స్పందన వచ్చింది.  అలా పాలివ్వటం ఆమెకు మొదటిసారి కాబట్టి ఆమె అంత ఎక్సైట్ మెంటు చూపించింది కానీ నెట్ లో వెతికితే అలాంటివి చాలా ఫోటోలు, వీడియోలు కనిపిస్తాయి!  ఎవరికి పాలిస్తూ ఫొటో దిగినా చూస్తారు చాలామంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles