Bharat ratna sachin tendulkar

Bharat Ratna Sachin Tendulkar, Bharat Ratna Scientist CNR Rao, Bharat Ratna awarded to Sachin, President awards Bharat Ratna to Sachin, Cricketer Sachin Tendulkar

Bharat Ratna Sachin Tendulkar, Bharat Ratna Scientist CNR Rao

భారత రత్న సచిన్

Posted: 02/04/2014 01:36 PM IST
Bharat ratna sachin tendulkar

ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా క్రికెట్ ఆటగాడుగా ఎన్నో రికార్డ్ లను స్థాపించి ప్రపంచ విఖ్యాతి పొందిన సచిన్ టెండూల్కర్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత రత్న పురస్కారం లభించింది. 

ఈ సభకు యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఇంకా ఎందరో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

దేశంలో అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా సచిన్ టెండూల్కర్ అందుకున్నారు.  ఈ పురస్కారాన్ని నవంబర్ 14 న సచిన్ ఆఖరు టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున క్రీడారంగ మంత్రి ప్రకటించారు.  ఆ తర్వాత రోజు అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగి ప్రధాన మంత్రి, రాష్ట్రపతికి కార్యాలయాలలో జరగవలసిన తంతునంతా పూర్తి చేసుకుని నవంబర్ 16 న ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.  ఆ ప్రకటనలో సచిన్ తో పాటు ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు పేరు కూడా భారత రత్న ప్రదానానికి నిర్ణయించినట్లుగా ఉంది.  ఆ తెల్లవారి లిఖిత పూర్వకంగా సచిన్ కి, సిఎన్ఆర్ రావుకి అందజేయటం జరిగింది. 

భారత రత్న కోసం శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు పేరును ప్లానింగ్ కమిషన్ సభ్యుడు కస్తూరి రంగన్ సెప్టెంబర్ లోనే సిఫారసు చేసారు.   అయితే ఆయన విషయంలో ప్రభుత్వం తతంగాన్ని పూర్తి చెయ్యటానికి ఆయన బయోడేటా ఇతర వివరాలను తెప్పించుకుని జాప్యం చేసింది. 

అదే సచిన్ టెండూల్కర్ విషయంలో పనంతా చకచకా జరిగిపోయింది.  ఎంతైనా సెలబ్రిటీ విషయమే వేరు కదూ!  అంతేకాదు, సచిన్ కి భారతరత్న ప్రకటన, ప్రదానం చెయ్యటానికి అంతా జరిగిపోయిన వేగంలో సిఎన్ఆర్ రావు విషయంలో కూడా నిర్ణయం త్వరగా కొలిక్కి వచ్చింది! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles