Victims hiding faces in society encourage rapists

victims hiding faces in society encourage rapists, rapes and gang rapes, rape victims afraid of publicity, rapists encouraged of shy victims

victims hiding faces in society encourage rapists, rapes and gang rapes, rape victims afraid of publicity

ముఖం చాటేసే బాధితులతో నేరగాళ్ళకు ధైర్యం?

Posted: 02/04/2014 12:17 PM IST
Victims hiding faces in society encourage rapists

మన దేశంలో బాధితులు తల వంచుకుంటారు, నిందితులు తల పైకెత్తుకుని తిరుగుతారు! 

ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల పట్ల ఆగని అత్యాచారాలలో ఎన్ని బయటకు వస్తున్నాయి.  వంచితులు తామేదో తప్పు చేసినట్లుగా సమాజంలో ముఖం చూపించకపోవటం సాధారణంగా జరగుతుండటం కూడా నేరాలకు ప్రోద్బలమిస్తోందంటున్నారు విజ్ఞలు, మానసిక శాస్త్రవేత్తలు, సంఘ సంస్కరణలలో ఆసక్తి చూపించేవారు.  దీని వలన, బాధితులు పైకి చెప్పుకోలేరులే అనే ధీమా కూడా నేరస్తులకు కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. 

అత్యాచారం జరగకముందు కేకలు పెట్టి రభస చేస్తే నలుగురూ రావొచ్చేమో కానీ అత్యాచారం చేసిన తర్వాత బాధితులు పైకి చెప్పుకోలేరు, తమకేం కాదు అన్న భరోసాతో నేరం చేసినవారు తలపైకెత్తుకుని తిరుగుతుంటారు, బాధితులు లోలోపలే కుమిలిపోతూ ఎవరికీ చెప్పుకోలేకుండా ఉంటారు.  అందరికీ తెలిస్తే మరింత మానసిక వ్యధకు గురవుతారనే ఉద్దేశ్యంతో దగ్గరివాళ్ళే కాకుండా మీడియా కూడా అందుకు సహకరిస్తూ, చట్టమూ అందుకు మార్గదర్శకాలివ్వటంతో బాధితుల వివరాలను ప్రకటించకుండా వార్తలు వస్తుండటం జరుగుతోంది.  నేరస్తులెవరో తెలియనప్పుడు అనవసరంగా సమాజంలో తలవంపులు వస్తాయని అందరూ జరిగిన విషయాన్ని దాచిపెడుతుంటారు. 

అత్యాచారం జరిగినప్పుడు సిగ్గుతో తల వంచుకోవలసింది సమాజమే కానీ ఆ ఆడపిల్ల కాదు.  అబలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం, చట్టాన్ని అమలు పరచలేని పోలీసులు, నిందితులకు శిక్ష విధించలేని న్యాయస్థానాలు పడవలసిన సిగ్గంతా కలిసి బాధితురాలే పడటం ఎంత వరకు సబబు? 

ఈ విషయంలో సమాజంలోనూ, ఆడపిల్లల ఆలోచనలలోనూ మార్పు వచ్చి, అత్యాచారం కూడా దుర్ఘటనే, దానికి బాధ్యులైన వారు నేరస్తులు, దాని వలన నష్టపోయినవారు సమాజం నుంచి కూడా రక్షణ పొందవలసినవారు అన్నది బాగా ఇంకాలి.  సమాజం నుంచి రక్షణ పొందటమంటే వాళ్ళెవరో సమాజంలోని వాళ్ళకి తెలియకపోవటం కాదు.  సమాజంలో ఉన్నవాళ్ళంతా ఆ బాధితురాలు తమ సొంత మనిషనే భావనలో ఆమెకు ఆశ్రయమివ్వటం చాలా ముఖ్యం.  మాటలలోనే కాదు చూపులలో, ఇతర వ్యవహారాలలో బాధితురాలిని చులకన చేసే విధంగా కాకుండా అక్కున చేర్చుకునేవిధంగా ఉండాలి.  ఇలాంటి దుర్ఘటన ఎవరికైనా కలగవచ్చుకదా అన్న భావన వస్తే తప్ప సమాజంలో అందరూ ఆమె పట్ల ఆవిధంగా వ్యవహరించటం మొదలుపెట్టరు. 

నేరస్తులను బహిరంగంగా ఉరితీయాలి అని వాదించేవారు, అందుకు ఆందోళన చేసేవారు ముందుగా బాధితులకు ఎంత ఊరట కలిగిస్తున్నామన్నది కూడా చూడాల్సి వుంటుందన్నిది ఒక ఆలోచన.

దీన్ని మీరెంత సమర్ధిస్తారు?

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles