Bjp taking u turn on bjp

BJP taking U turn on Telangana, BJP leader Sushma Swaraj, BJP President Rajnath Singh, TRS President KCR, Telangana Bill, AP Chief Minister Kiran Kumar Reddy

BJP taking U turn on Telangana

తెలంగాణా పై భాజపా యు టర్న్ తీసుకుంటోందా?

Posted: 02/04/2014 09:18 AM IST
Bjp taking u turn on bjp

అఖిల పక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణా బిల్లు మీద అనుమానాలు వ్యక్తపరచటంతో భాజపా యు టర్న్ తీసుకుంటోందా అన్న అనుమానాలను పలు వార్తా పత్రికలు, మీడియా వ్యక్తపరచాయి.  అందులోనూ తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఇంటర్వ్యూ లభించకపోవటంతో ఆ అనుమానం ఇంకా బలపడసాగింది.  అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన తెలంగాణా బిల్లు మీద ముఖ్యమంత్రి తిరస్కరణ నిర్ణయానికి సుష్మా స్వరాజ్ విలువనిస్తూ మాట్లాడారు.

అయితే అదంతా ఏమీ లేదని భాజపా నాయకులు వివరణనిచ్చారు.  సభ సజావుగా సాగితేనే తెలంగాణాకి మద్దతునిస్తామని అనటంలో భాజపా ఉద్దేశ్యాన్ని ఇలా వివరించారు.

దేశంలో అత్యవసరమైన అవినీతి వ్యతిరేక బిల్లులలాంటివి ఉన్నాయి.  ఈ టెర్మ్ కి ఇదే ఆఖరు పార్లమెంటు సమావేశం కూడా.  ఈ నేపథ్యంలో తెలంగాణా బిల్లు కూడా అజెండాలో ఉన్నట్లయితే తెలంగాణా, ఆంధ్రా నాయకుల నుంచి వ్యతిరేకతలు వస్తాయని, సభలో గందరగోళం ఏర్పడి సభ సాగకపోవచ్చని భాజపా భావిస్తోంది.  అందుకు అంతకు ముందు సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితి వలన కలిగిన అనుభవంతో ఈ సంగతి ప్రస్తావిస్తూ, సభను సజావుగా సాగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నట్లయిత తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లుకి సహకరిస్తామని చెప్పారు.  తెలంగాణా బిల్లు వలన సభలో ఆటంకాలు ఏర్పడవచ్చన్న అనుమానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండటం, సాక్షాత్తూ ముఖ్యమంత్రే దీక్షకు పూనుకోవటం లాంటివి ఊతాన్నిస్తున్నాయన్నారు. 

తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే మరే చర్చకూ అవకాశముండదన్న ఉద్దేశ్యాన్ని సమాజ్ వాదీ పార్టీ, జెడి యు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు వెలిబుచ్చాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles