Cm resolution against t bill passed in assembly

CM Resolution against T Bill passed in Assembly, Assembly adjourned sine die, Speaker Nadendla Manohar, Chief Minister Kiran Kumar

CM Resolution against T Bill passed in Assembly, Assembly adjourned sine die

సభలో ఆమోదించిన ముఖ్యమంత్రి తీర్మానం

Posted: 01/30/2014 12:04 PM IST
Cm resolution against t bill passed in assembly

కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఆఖరు బంతి లక్ష్యాన్ని ఛేదించింది.  రాష్ట్ర పునర్విభజన బిల్లుని తిరస్కరించి పంపించాలన్న ముఖ్యమంత్రి తీర్మానానికి ఈ రోజు శాసనసభలో గందరగోళం నడుమ చేపట్టిన మూజుబాణి ఓటు తో సభాపతి నాదెండ్ల మనోహర్ తీర్మానాన్ని ఆమోదిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేసారు. 

దీనితో బిల్లు మీద చర్చ ముగిసిందని చెప్పిన సభాపతి, బిల్లు మీద మొత్తం 9072 సవరణలకు ప్రతిపాదనలు వచ్చాయని, 86 మంది శాసన సభ్యుల దీని మీద మాట్లాడారని తెలియజేసారు.  దానితో ముఖ్యమంత్ర సమైక్య నినాదం చేస్తూ సభనుండి బయటకు వచ్చారు.

మరోపక్క సీమాంధ్రలో తెదేపా పిలుపు మేరకు బంద్ జరుగుతోంది.  కానీ బిల్లు తిరస్కరణ వార్తతో సీమాంధ్రలో అంతా సద్దుమణిగే అవకాశం ఉంది.  ఇక దీని ప్రభావం తెలంగాణాలో ఉద్రిక్తతలను నెలకొల్పటానికి అవకాశం కూడా కనిపిస్తోంది. 

శాసన సభలో గొడవ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లైతే జరిగాయి కానీ తెలంగాణా ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని అధికారులు జాగ్రత్తలు పడుతున్నారు.  గొడవలు పెరగకుండా ఉండటం కోసం తీసుకున్న చర్యలో భాగంగా అసెంబ్లీ సమీపంలో మీడియాకు అనుమతి నివ్వలేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles