Stinking house with full of snakes

Stinking house with full of snakes, Willam Buchman house, Buchman house with snakes and rats, House full of snakes and rats

Stinking house with full of snakes, William Buchman house snakes and rats

ఆయన ఇల్లే ఒక పాముల పుట్ట

Posted: 01/30/2014 11:45 AM IST
Stinking house with full of snakes

కాలిఫోర్నియాలో కంపుకొడుతున్న ఒక ఇంటి నుంచి పాములను బుధవారంనాడు బయటకు తీసుకునివచ్చారు అధికారులు.  అందులో చచ్చిపోయిన, చచ్చిపోతున్న, నీరసించి పోయిన, ఇంకా ప్రాణాలతో ఉన్న వివిధ రకాల పాములున్నాయి.   వాటిని బయటకు తీసుకున్నవారు రెస్పిరేటర్లను ముఖానికి వేసుకుని చెయ్యవలసివచ్చిందా పనిని.  చుట్టుపక్కల వాళ్ళు, దారిన పోయే వాళ్ళంతా ముక్కు మూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు.  ఇంట్లోంచి బయటకు వస్తున్న వాసనను భరించలేకనే చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు అధికారులకు ఫిర్యాదు చెయ్యటం జరిగింది.

ఒక వారం రోజులపాటు షవర్ కింద కూర్చుంటే కానీ ఈ కంపు వదలదు అన్నాడు ఒక పోలీస్ అధికారి.  ఆ ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసు అధికారులు దాదాపు 350 పాములను అక్కడ చూసారు.  వాటితో పాటు ఎలుకలు కూడా అక్కడ రాజ్యమేలుతున్నాయి.  రాజ్యమేలటమేమిటి పాపం తిండి లేక చచ్చిపోయినవి కొన్నైతే చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న ప్రాణులు మరికొన్ని.  బ్రతకటం కోసం తమ జాతినే తింటున్నవి మరికొన్ని.  ఇక వాసన రాక ఏమవుతుంది.

అది శాంతా ఆనా లో ఉన్న విలియమ్ బుచ్ మన్ 5 పడక గదుల నివాసం.  53 సంవత్సరాల బుచ్ మన్ ని జంతువులను సరిగ్గా చూసుకోని నేరం మీద అరెస్ట్ చేసారు.  అతనితో పాటు ఆ ఇంట్లో నివసించే అతన తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన దగ్గర్నుంచి అందులో బుచ్ మన్ ఒక్కడే ఉంటున్నాడు.  ఐదు పడకగదులలో నాలుగిటిలో నేల నుంచి కప్పు వరకు పెట్టిన ప్లాస్టిక్, మెటల్ మరి కొయ్య డబ్బాలలో పాములు, ఎలుకలు ఉన్నాయి.  ఆ డబ్బాల మీద ఆ ప్రాణులు ఏ జాతికి చెందినవన్న వివరాలు రాసివున్నాయి.  ఆ డబ్బాలకు మూతలు కూడా లేవట.  ఎందుకంటే వాటిల్లో కుక్కి కుక్కి పెట్టిన పాములు కదలటానికి కూడా అవకాశం లేదు.  ఇక బయటకేం వస్తాయి.  ఆహారం లేక ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని కేవలం అస్తిపంజరాల్లా చావుకి సిద్ధంగా ఉన్నాయవి.  

ఇంతకీ ఎందుకదంతా అంటే పాములను పెంచే సంస్థలో పనిచేస్తున్నానని చెప్పాడతను.  అతను పనిచేస్తున్న సంస్థ ఈ విషయంలో మాట్లాడటానికి నిరాకరిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles