Ap forest department 2547 jobs notification 2014

AP Forest Department, 2547 Jobs Notification 2014, Forest Beat Officer, Range Officer, Section Officer, Assistant Beat Officer

Govt of AP, Department of Forest will soon issue a notification for 2547 forest department job vacancies.

అటవి శాఖలో 2547 పోస్టులకు నోటిఫికేషన్

Posted: 01/28/2014 10:51 AM IST
Ap forest department 2547 jobs notification 2014

రాష్ట్ర ప్రభుత్వం అటవి శాఖలో ఉన్న ఖాళీలను పూర్తి చేసేందుకు సిద్దం అయింది. రానున్న మూడేళ్ళ వ్యవధిలో 3,820 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి రెండేళ్ళకు సంబంధించిన 2547 పోస్టులను త్వరలోనే భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ధరఖాస్తు స్థాయి నుండి పరీక్ష నిర్వహణ వరకు జేఎన్ టీయూకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి కనీస విద్యార్హత పదోతరగతి, ఇంటర్ మీడియట్ గా నిర్ణయించారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు పదవ తరగతి, బీట్ ఆఫీసర్ కి ఇంటర్ మీడియెట్ , సెక్షన్ ఆఫీసర్ కి, రేంజి అధికారి పోస్టులకు విధిగా సైన్సు పట్టభద్రులు, ఇంజనీరింగ్ సైన్స ఆధారంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

నియామకపు ప్రక్రియను మూడు నుండి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు అటవి శాఖ సంరక్షణ అధికారి బి. సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు రాబోవు పరీక్షలకు సిద్దం కండి.


అసిస్టెంట్ బీట్ ఆపీసర్స్ పోస్టులు : 1500
బీట్ ఆఫీసర్ పోస్టులు              : 1600
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్             : 600
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్              : 120

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles