Long legged british model alexandra robertson

Long legged British model Alexandra Robertson, World longest legged model, Russian long legged Anastasia Strashevskaya

Long legged British model Alexandra Robertson, Anastasia Strashevskaya

పొడుగు కాళ్ళ ప్రపంచ సుందరి

Posted: 01/28/2014 09:31 AM IST
Long legged british model alexandra robertson

మోడల్స్ లో పొడుగు కాళ్ళవాళ్ళదే ఎప్పుడూ పై చేయి (పై కాలు అనలేము కాబట్టి).  పొడవు కాళ్ళతో నడుస్తున్నప్పుడు హుందాతనం ఉట్టిపడుతుంది, ప్రపంచంలో అందరికంటే ఎత్తులలో కదులుతున్న భావనతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఇప్పటి వరకూ 42 అంగుళాల పొడవాటి కాళ్ళున్న 18 సంవత్సరాల రష్యన్ మోడల్ అనాస్తేసియా స్ట్రాషేవ్స్కియా  ప్రపంచంలో అతి పొడవు కాళ్ళ సుందరిగా నిలిచింది. 

అయితే ఆ ప్రపంచ పొడవు కాళ్ళ సుందరి స్థానాన్ని బ్రిటిష్ మోడల్ అలెగ్జాండ్రా రాబర్ట్ సన్ రష్యన్ సుందరి నుంచి లాగేసుకోబోతోంది.  

రాబర్ట్ సన్ కాళ్ళ పొడవు 47 అంగుళాలు.  అందువలన వచ్చే సంవత్సరం పొడవు కాళ్ళ సుందరి పోటీలో ఆమే ప్రపంచ స్థాయిలో అతి పొడవైన కాళ్ళ సుందరిగా పేరుగాంచబోతోంది. 

బ్లాక్ పూల్ కి చెందిన రాబర్ట్ సన్ పొడవు 6 అడుగుల 1 అంగుళం.  ప్రపంచ రికార్డ్ గల 42 అంగుళాల కంటే 5 అంగుళాలు పొడవుండటంతో ఆమే అత్యంత పొడవైన కాళ్ళ సుందరిగా నిలుస్తుందని ఆమె గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

హైహీల్డ్ షూస్ వేసుకుంటే అందరి కళ్లూ ఆమె వైపే ఉంటున్నాయంటోంది మోడల్ రాబర్ట్ సన్.  బాస్కెట్ బాల్ ఆడతావా అని కొందరు అడిగారట కూడా.   ప్రస్తుతం 20 సంవత్సరాల వయసులో ఉన్న రాబర్ట్ సన్ 18 సంవత్సరాల వయసులో మిస్ బ్లాక్ పూల్ అవార్డ్ ని అందుకుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles