3d printer makes pizzas to astronauts

3 d pizza printer, NASA, Astronauts, Pizza to astronauts by 3D printer, Pizza in 70 seconds on 3D printer

3D printer makes pizzas to astronauts

ఆహారాన్ని సరఫరా చేసే 3 డి ప్రింటర్

Posted: 01/27/2014 06:02 PM IST
3d printer makes pizzas to astronauts

నమ్మలేకుండా ఉన్నారు కదూ.  కానీ ఇది నిజం.  ఈ ప్రింటర్ కేవలం 3 డి లో ఆహారం ప్రతిరూపం తయారు చెయ్యటం కాదు నిజంగా వినియోగించే ఆహారాన్ని తయారు చేసిస్తుంది.

ఎక్కువ కాలం పాటు రోదసీ ఉండే వ్యోమగాములకు వెంట తీసుకెళ్ళే డబ్బాలలోని ఆహారం, ఫ్రీజ్ చేసిన ఆహారం ఎంత కాలం సహిస్తుంది.  అందువలన నాసా 125000 డాలర్ల వ్యయంతో అటువంటి ప్రింటర్ ని తయారు చెయ్యటానికి మెకానికల్ ఇంజినీర్ అంజన్ తో ఒప్పందం చేసుకుంది. 

ఫాస్ట్ ఫుడ్స్ చూసాం కానీ, ఇప్పడు ఫాస్ట్ కో ఎగ్జిస్ట్ డాట్ కామ్ ప్రకారం, 3 డి ప్రింటర్ సాయంతో దూరంగా ఉన్నవారికి పిజ్జాను 3 డిలో తయారు చేస్తామని అన్నారు.  అది ఇప్పుడు నిజమైందని అనిపిస్తోంది.  ఈ 3 డి ప్రింటర్, ఆహారానికి అవసరమైన ప్రోటీన్లు, స్టార్చ్, కొవ్వు పదార్థాలను సమకూరుస్తూ, చివర్లో దాని మీద ప్లావర్, వాసన, మైక్రో న్యూట్రియన్ట్స్ ను స్ప్రే చేస్తుందట. 

70 సెకండ్లలో 3 డి ప్రింటర్ పిజ్జాను తయారు చేసిందని కాంట్రాక్ట్ పొందిన సంస్థ యు ట్యూబ్ లో తెలియజేసింది.  ఈ సంస్థ టెక్సాస్ కి చెందిన ఒక సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ కార్పొరేషన్.

భారత దేశంలో ఎప్పటినుంచో ఇలాంటిది డిమాండ్ లో ఉంది.  ముఖ్యంగా పాన్ నమిలే అలవాటున్న వాళ్ళకు పాన్ షాప్ లలో వివిధ మిశ్రమాల్లో ఆర్డర్ చేస్తుంటారు.  ఎటువంటి ఆకులో కట్టాలి, సున్నం ఎక్కువ తక్కువ, కాచు వెయ్యాలా వద్దా, ఎటువంటి సుపారీ వెయ్యాలి, ఇంకా సోంఫ్, ఇలాచీ, లవంగాలు, జర్దా, వాటి పాళాలు ఇలా రకరకాలుగా కోరుతుంటారు.  ఆ పాన్ కట్టటంలో ఆలస్యమైనట్లయితే అసహనం కూడా చూపిస్తుంటారు.  అలాంటి వాళ్ళకి 3 డి పాన్ ప్రింటర్ చాలా ఉపయోగయోగ్యంగా ఉంటుందనుకుంటా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles