2014 general elections survey report

2014 general elections survey report, India Today survey report, BJP Narendra Modi, Congress party, Rahul Gandhi, Arvind Kejriwal

2014 general elections survey report

2014 సాధారణ ఎన్నికల సర్వే రిపోర్ట్

Posted: 01/24/2014 10:37 AM IST
2014 general elections survey report

ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ ఒపీనియన్ పోల్ ఫలితాలననుసరించి,

1. నరేంద్రమోదీ నేతృత్వంలో భాజపాకు 188 స్థానాలు వచ్చే అవకాశం.  దానితో అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది.   2009 ఎన్నికలలో సాధించిన స్థానాలు 116.

2. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి 91 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం.  ప్రస్తుతం ఉన్న స్థానాలు 206.

3. యుపిఏ, ఎన్డీయే కాకుండా ఇతర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 220 కి పైగా స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది.  అంటే థర్డ్ ఫ్రంట్ కి మంచి అవకాశాలున్నాయన్న మాట. 

4. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇటీవల కాలంలో హవా కనిపిస్తున్నా, ఆ పార్టీ సాయంతో భాజపాకి చెక్ పెడదామని చూస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.  కేజ్రీవాల్ ప్రాబల్యం కేవలం ఢిల్లీ ఆ చుట్టుపక్కల నగరాలకే పరిమితం అవుతుంది.

5. రాష్ట్రంలో చూసుకుంటే,  కాంగ్రెస్ కి తెలంగాణా లో ఆశించిన ఫలితాలు రావు.  సీమాంధ్రలోనూ, తెలంగాణాలోనూ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు.  కాంగ్రెస్ కి 7 స్థానలు, వైకాపా కి 13, తెదేపా కి 8 స్థానాలు లభించే అవకాశం.  తెదేపా ఇరు ప్రాంతాలలోనూ బలపడుతుంది.  తెదేపా పొత్తు భాజపాతో గనక జరిగితే, రెండు పార్టీలకూ లాభం జరుగుతుంది. 

6. కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక తమిళనాడు లోనూ స్థానాలను దక్కించుకోలేక పోతుంది. 

7. కర్నాటక, కేరళలలో చూసుకుంటే, కర్నాటకలో కాంగ్రెస్ కి 12, భాజపాకి 13 స్థానాలు రాగా బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీకి 1 స్థానం రావొచ్చు.  కేరళలో కాంగ్రెస్కి  6, వామపక్షాలకు 11 స్థానాలు దక్కే అవకాశం ఉంది. 

8. ఇక ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి ఉన్న పరపతి చూసుకుంటే, నరేంద్ర మోదీకి 47 శాతం, రాహుల్ గాంధీకి 15 శాతం, అరవింద్ కేజ్రీవాల్ కి 9 శాతం కనిపించింది.

ఇది తెలిసే కాబోలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తమ పార్టీ తరఫునుంచి ప్రధాన మంత్రి అభ్యర్ధని ప్రకటించలేదు

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles