Cine political personalities had last darshan of akkineni

ANR passes away, Akkineni Nageswara Rao Dies, Akkineni Nageswara Rao Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death, Celebrity Death, Telegu Cinema, Telugu films, hyderabad, cancer, died.

cine political personalities had last darshan of Akkineni

అక్కినేని అంతిమ దర్శనానికి ప్రముఖుల ఆగమనం

Posted: 01/22/2014 11:05 AM IST
Cine political personalities had last darshan of akkineni

అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతిమ దర్శనం కోసం పెట్టివుంచిన అక్కినేని నాగేశ్వరరావు పార్థివ శరీరాన్ని దర్శించటానికి సినీ రాజకీయ రంగ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. 

రాష్ట్ర శాసన మండలి అక్కినేని కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.  అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు పార్ధివ శరీరాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ప్రముఖులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలి, ప్రజాగాయకుడు గద్దర్, తెదేపా సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ ఉన్నారు.

నివాళులు అర్పించిన సినీ ప్రముఖులలో డి.రామానాయుడు, దర్శకుడు రాఘవేంద్రరావు, అనుష్క, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, జీవిత రాజశేఖర్ ఉన్నారు.  దుర్వార్త తెలిసిన వెంటనే రాజమండ్రిలో ఉన్న మురళీ మోహన్ హుటాహుటిన హైద్రాబాద్ కి బయలుదేరారు. 

భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అక్కినేని కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ సినీ రంగంలో ఆయన సేవలను కొనియాడారు. 

-శ్రీజ

Click here for Celebrities Pay Tribute To ANR Photos

Click here for ANR Condolences Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles