New political party samaikya prajavani

New political party Samaikya Prajavani, Kiran Kumar Reddy, Botsa Satyanarayana

New political party Samaikya Prajavani

ఊపందుకుంటున్న కొత్త పార్టీ 'సమైక్య ప్రజావాణి'

Posted: 01/22/2014 09:31 AM IST
New political party samaikya prajavani

కొత్త పార్టీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నవారికి ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, టివి ల్లోనూ సమైక్య ప్రజావాణి  పేరుతో ఆవిర్భవిస్తున్న పార్టీ గురించి తెలుసుకోవటంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.  ఈ పేరు మీద అభ్యంతరాలుంటే తెలియజేయాలన్న విన్నపాన్ని కూడా ప్రకటించటం జరిగింది. 

అయితే అందరూ అనుకుంటున్నట్లుగా కొత్త పార్టీని స్థాపిస్తున్నవారు ముఖ్యమంత్రి కిరణ్ కుమారేనా కాదా అన్న విషయంలో ఇంకా ధృవీకరించటం జరగలేదు.  అయితే కొత్త పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని ఆయన ఖండించనూ లేదు. 

ఈరోజు ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో జరుగబోతున్న చలో హైద్రాబాద్ కార్యక్రమంలో ఈ కొత్త పార్టీ గురించిన వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంది.  ఈ కొత్త పార్టీ చేరికతో మొత్తం ఇప్పటికి రాష్ట్రంలో అర్థశతకం ఉన్న పార్టీల సంఖ్య 51 అవుతుంది.  ఈ వార్తల మీద ఘాటుగా స్పందిస్తూ, సమైక్య ముసుగులో వస్తే మటాషే అన్నారు పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ. 

ఎవరు కడుతున్నారో తెలియకుండా రాత్రికి రాత్రే బ్యానర్లు కడుతున్నవారు, ఈ పార్టీ వెనక ఎవరున్నదన్న విషయంలో గోప్యతను కాపాడుకుంటూ వస్తున్నారు.  అదే దీని వెనుకనున్నది కిరణ్ కుమార్ అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.  అయితే పార్టీ గురించిన ప్రకటన చేస్తూ నెల రోజులలాగ అభ్యంతరాలుంటే తెలియజేయాలనే నోటీసునిచ్చిన వారు పార్టీ తరఫునుంచి అధ్యక్షుడిగా కె.ఆర్.రెడ్డి, కార్యదర్శిగా కె.అనిల్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా జి. వెంకటరామ రెడ్డి పేర్లను అందులో ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles