Mumbai new air terminal t 2

Mumbai new air terminal T-2, Mumbai new airport, Modern airport at Mumbai, Prime Minister Manmohan Singh, Maha CM Prithviraj Chauhan

Mumbai new air terminal T-2

ముంబై నగరానికి కొత్త శోభ- రెండవ విమానాశ్రయం

Posted: 01/10/2014 01:18 PM IST
Mumbai new air terminal t 2

అంతర్జాతీయ స్థాయిలో తయారైన ముంబై రెండవ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. 

కొంగ్రొత్త సొబగులతో నిర్మించబడ్డ ఈ విమానాశ్రయ సౌధంలోని ప్రత్యేకతలు ఇవి-

1. ఇందులో 188 చెక్ ఇన్ పాయింట్లు, ముంబై నుంచి వెళ్ళేవారికోసం 60, ముంబై చేరుకున్న ప్రయాణీకులకోసం 76 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. 

2. ఇందులో 47 ఎస్కలేటర్లు, 73 ఎలివేటర్లు ఉన్నాయి.  బోర్డింగ్ కి 52 గేట్లు, వేచివున్న సమయంలో కూర్చోవటానికి 11000 సీట్లు, ప్రయాణీకుల సౌకర్యార్ధం 101 టాయ్లెట్లు ఉన్నాయి.  ఇంకా 44 ట్రావెలేటర్స్, 16 లాంజ్ లు, 10 బ్యాగేజ్ పోయింట్లు ఉన్నాయి. 

3. ఇందులోని ఎస్కలేటర్ 11.6 మీటర్లతో దేశంలోనే అత్యంత ఎత్తైనది. 

4. ఆరవ అంతస్తు నుంచి 10 వరకు మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ ఉంది. 

5. దీనిలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 3 కిలోమీటర్ల గోడ మీద 1500 మంది భారతీయ కళాకారులు సృష్టించిన 7000 కళాఖండాలు అమర్చబడివున్నాయి. 

6. ముంబై నగర పటాన్ని కళాకారులు ఉపయోగ యోగ్యం కాని బటన్లు, మైక్రో చిప్స్ లాంటి వ్యర్ధ పదార్థాలతో తయారు చేసారు.  దీన్ని చూస్తే గూగుల్ ఎర్త్ నుంచి చూస్తున్నట్లుగా ఉంటుంది. 

7. విమానాశ్రయంలో వెలుగు రావటం కోసం పై కప్పులో అమర్చబడ్డ అద్దాలు సూర్యుని కదలికలకు అనుగుణంగా కదులుతాయి.  272 అద్దాలలోంచి వచ్చే కాంతి పుంజాలు నెమలి ఈక వర్ణంలో ప్రతిబింబిస్తాయి.  వీటితో పాటు 244 చిన్నపాటి ఆకాశ దీపాలు కూడా ఉన్నాయి.  ఇవి ముప్ఫైవేల చదరపు మీటర్లలో కాంతిని వెదజల్లుతూ ఒక వెయ్యి నెమళ్ళు నృత్యం చేస్తున్నాయా అనిపించేట్టుగా ఉంటుంది. 

8. నాలుగు లక్షల ముప్ఫై తొమ్మిదివేల చదరపు మీటర్ల స్థలంలో నిర్మించిన ఈ టి-2 విమానాశ్రయం సంవత్సరానికి 4 కోట్ల విమాన యాత్రికులకు సేవలందించటానికి సిద్ధంగా ఉంది.  భారత్ లో రద్దీగా ఉండే విమానాశ్రయంలో ప్రస్తుతం మూడు కోట్ల 20 లక్షల యాత్రికులు విమానయానం చేస్తున్నారు. 

9. నాలుగు అంతస్తులలో నిర్మించిన ఈ టెర్మినల్ లో మొదటి అంతస్తు భూతల రవాణాకి, ఆ పైన రెండవ అంతస్తు ముంబై చేరుకునే ప్రయాణీకులకు, మూడవది భద్రతా వ్యవస్థకు, రిటైల్ దుకాణాలకు, నాల్గవది దేశ విదేశ యానం చేసే ప్రయాణీకుల చెక్ ఇన్, అంతర్జాతీయ భద్రత మరి ఇంకా రిటైల్ దుకాణాలకు కేటాయించబడ్డాయి. 

10. ఈ టెర్మినల్ నిర్మాణ వ్యయం- రూ.9800 కోట్లు.  ఇది ముందు వేసిన అంచనా రూ. 7452 కోట్లు.  నిర్మాణంలో మూడు సంవత్సరాల జాప్యం 32 శాతం వ్యయంలో వృద్ధి జరిగింది కానీ భారతదేశం గర్వపడేలా తయారైందీ విమానాశ్రయం. 

11. యుపిఏ ప్రభుత్వంలో ప్రైవైటేజేషన్ పాలసీలో దీని నిర్మాణాన్ని జివికే కైవసం చేసుకుంది.  కానీ కన్సోర్టియంలో కాంట్రాక్ట్ తీసుకున్న జివికె సంస్థతో పాటు ప్రభుత్వ సంస్థైన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 శాతం భాగస్వామ్యం కలిగి ఉంది. 

12. 12500 కోట్ల వ్యయంతో 2008 లో మొదలైన ఆధునీకరణ చేసే పని నిజానికి 2010 లో పూర్తి కావలసింది. 

13. విదేశ విమానాశ్రయాలతో పోల్చి చూస్తే, సింగపూర్ లోని షాంగీ టి-3 కన్నా, లండల్ లోని హీత్రూ టి-5 కన్నా విశాలమైనది. అవి 3.8 లక్షల చదరపు మీటర్లు, 3.53 చదరపు మీటర్లలో నిర్మించబడ్డాయి.  ముంబై టి-2, 4.39 లక్షల చదరపు మీటర్లలో నిర్మించబడింది.

ఈరోజు జరిగే ప్రారంభోత్సవంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు ఎన్ సి పి అధ్యక్షుడు, కేంద్ర మంద్రి శరద్ పవార్, సివిల్ ఏవియేషన్ మంత్రి అజిత్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ లు హాజరవనున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles