Devyani khobragade indictment jan 13

Devyani Khobragade indictment jan 13, Devyani Khobragade, US Prosecutor Preet Bharara, Sangeeta Richard, US Ambassador Nancy Powell

Devyani Khobragade indictment jan 13

దేవయాని కేసులో ఇరుదేశాల పట్టుదలలు

Posted: 01/07/2014 12:38 PM IST
Devyani khobragade indictment jan 13

దేవయాని విషయం తెగేవరకు సంబంధాలు మునపటిలా ఉండవని జాయింట్ సెక్రటరీ (అమెరికా) విక్రమ్ దొరైస్వామి అమెరికా దౌత్యవేత్త నాన్సీ పౌవెల్ కి స్పష్టం చేసారు.  నాన్సీ పౌవెల్ సౌత్ బ్లాక్ లో దొరైస్వామిని కలిసిన సందర్భంలో ఆయన ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసారు.  అంతేకాదు, అది మీ పని, మీరు చెయ్యాల్సింది, మీరే పరిష్కరించుకోవలసింది అని కూడా అన్నారాయన.

దేవయాని ఖోబ్రాగడె వీసా నియమ ఉల్లంఘన కేసులో ప్రాధమిక విచారణ మొదలుపెట్టటానికి జనవరి 13 ఆఖరు తేదీగా అమెరికన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా దొరైస్వామి చేసిన హెచ్చరిక విశేషాన్ని సంతరించుకునే విషయమే.  బేషరతుగా దేవయాని మీద కేసు ఎత్తివేయాలని, క్షమాపణ కోరాలని భారత్ డిమాండ్. 

కానీ ఈ లోపులో జనవరి 13 నుంచి తేదీని ఫిబ్రవరి 12 వరకు పొడిగించవలసిందిగా యుఎస్ జిల్లా కోర్టు లో జడ్జ్ సారా నెట్బర్న్ ని కోరిన దేవయాని అడ్వకేట్ డేనియల్ అర్షాక్ విన్నపానికి అంతకంటే పట్టుదల చూపిస్తున్న అమెరికన్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా అడ్డు తగిలి, ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం కానీ నేరస్తురాలి నుండి ఎటువంటి సంజాయిషీ రాలేదు.  ఇంకా ఆ కేసు మీద చర్చలు అనవసరం.  ప్రాథమిక విచారణను మొదలుపెట్టవలసిందే.  పైగా ప్రాధమిక విచారణ మొదలుపెట్టిన తర్వాత కూడా నిర్దోషినన్న సంజాయిషీలు చెప్పుకోవచ్చు అంటూ కోర్టు కి తెలియజేసారు. 

యుస్ లో పనిచేస్తున్న భారత్ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రాగడె తన ఇంట్లో పనిచేసే సంగీతా రిఛర్డ్ వీసా విషయంలో నేరం చేసిన కేసులో డిసెంబర్ 12 న అరెస్ట్ చేసారు.  ఆమెను వివస్త్రతనిఖీకి గురిచేసి సాధారణ నేరగాళ్ళ మధ్య జైలులో ఉంచినందుకు భారత్ ప్రభుత్వం ప్రతిష్టాభంగమైన చర్యగా భావిస్తూ అమెరికా దౌత్యసంబంధాలు దీని వలన సరిగ్గా ఉండవంటూ హెచ్చరిస్తూ వస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles