Modi becoming pm to disastrous to the cong venkaiah naidu

Venkaiah Naidu, Manmohan Singh, weak Prime Minister of Indian,

Senior BJP leader Mr M.Venkaiah Naidu today alleged that Dr.Manmohan Singh headed a 'coalition of corruption' and was undoubtedly the weakest Prime Minister.

ప్రధాని వల్ల దేశం సర్వనాశనం : వెంకయ్య నాయుడు

Posted: 01/05/2014 02:54 PM IST
Modi becoming pm to disastrous to the cong venkaiah naidu

బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పై మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేశారు. నేడు హైదరాబాద్ లో విలేఖర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... గత తొమ్మిది సంవత్సరాల నుండి దేశానికి ప్రధానికిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధానిగా ఖ్యాతి గడించారని, ఈయన ప్రధాని అయ్యినప్పటి నుండి దేశానికి పక్షవాతం వచ్చి,  దేశం అన్ని విధాల సర్వనాశనం అయిందని అన్నారు.

ఈ తొమ్మిది సంవత్సరాల యూపీఏ పాలనలో దేశంలో అంతులేని అవినీతి, కుంభకోణాలు, ఆకాశానంటిన ధరలు, నిరుద్యోగం పెరిగిపోయాయని ఇవే వారి పరిపాలన ఏ విధంగా ఉందో అద్దం పడుతుందని అన్నారు. ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరోసారి ప్రధానిగా నేను చేయలేనని రిటైర్డ్ మెంట్ ప్రకటించినా, ప్రజలు ఆయనకి ఎప్పుడో రిటైర్డ్ మెంట్ ఇచ్చారని ఎద్దేవ చేశారు.

మోడీతో దేశంలో వచ్చే ఉపద్రవం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం అని, సరైన సమయంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని, ప్రధాని అవ్వడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లు చెప్పిన మన్మోహన్... అదే మీడియా ముందుకు వచ్చి ఆయనకు ఉన్న అర్హతలేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles