Jabbar travels bus run over rta staff

Jabbar travels bus run over RTA Staff, Jabbar travels volvo bus, Volvo bus burnt, RTA Constable wounded, RTA Checking intensified in AP

Jabbar travels bus run over RTA Staff

జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఆర్టీఏ అధికారుల మీదికి

Posted: 01/05/2014 09:16 AM IST
Jabbar travels bus run over rta staff

మహబూబ్ నగర్ జిల్లా పాలెం లో దగ్ధమైన జబ్బర్ ట్రావెల్స్ బస్సులో 45 మంది గుర్తుపట్టనంతగా కాలిపోయి మృత్యువాత పడిన తర్వాత ఆర్టీఏ తనిఖీలు ముమ్మరమయ్యాయి.  ఈ క్రమంలో జబ్బార్ ట్రావెల్స్ అందరికీ సుపరిచితమైపోయింది.  నియమాలను ఉల్లంఘించి నడుపుతున్న ఎన్నో బస్సులను సీజ్ చెయ్యటం జరిగింది.  టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేసి ప్రయాణీకుల సౌకర్యాలను పట్టించుకోకుండా యజమాన్యం తమ లాభాల కోసమే ఇష్టారాజ్యంగా నడుపుతూ వచ్చిన వ్యాపారం అధికారుల తనిఖీల వలన కుంటుపడుతుండటంతో ప్రైవేట్ బస్సు యజమానులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. 

హైద్రాబాద్ అమీర్ పేటలో ఆర్టీయే అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా జబ్బార్ ట్రావెల్స్ బస్సు వాళ్ళమీదకు దూసుకెళ్ళింది.  అర్టీయే కాన్ స్టేబుల్ కి గాయాలవగా హాస్పిటల్ కి తరలించారు.  జరిగిన సంఘటన మీద దర్యాప్తు జరుగుతోంది.  పూర్తి వివరాలింకా అందలేదు. 

కానీ, తనిఖీలు చేస్తున్న అధికారులను చూసిన గాభరాలో కాళ్ళూ చేతులు ఆడక బస్సు కంట్రోల్ తప్పే అవకాశం కూడా బాగా ఉంది.  పేపర్లలోనో లేక ఇన్సూరెన్స్ ఫిట్ నెస్ లేదా నడిపే డ్రైవర్ కి లైసెన్స్ లో లోపమో, డ్రైవర్ బదులు మరెవరైనా నడుపుతున్నారో లేదా అధికారులు చెప్పినట్లుగా ప్రయాణీకుల వివరాలను అప్పటికి సేకరించలేదో మరింకా ఎన్నో సమస్యలుండవచ్చు.  దానితో హడావిడిగా తప్పించుకుందామనో లేకపోతే భయంతోనో జరిగే అవకాశం కూడా ఉంది.

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కంగారులో వేగంగా నడుపటం వలన దుర్ఘటనలు చోటు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. 

ఈరోజు ఉదయం అమీర్ పేటలో నిర్వహించిన తనిఖీలలో ఆర్టీయే అధికారులు 11 బస్సులను సీజ్ చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles