Debate on t bill from monday kiran kumar reddy

Debate on T bill from Monday, Kiran Kumar Reddy, Telangana bill in Assembly, Sridhara Babu, Ponnam Prabhakar

Debate on T bill from Monday- Kiran Kumar Reddy

సోమవారం నుంచి బిల్లు మీద చర్చలు- కిరణ్ కుమార్

Posted: 01/04/2014 05:58 PM IST
Debate on t bill from monday kiran kumar reddy

ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదాను పంపిన రాష్ట్రపతి దాని మీద శాసన సభ అభిప్రాయాన్ని కోరారని, అంటే దాని అర్థం చర్చ జరగటమేనని వివరించారు.

అందువలన శాసన సభలో చర్చ జరగాలని, అందుకు అందరూ సహకరించాలని కోరుతూ అసెంబ్లీ అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అలాగే వోటింగ్ తోనే తెలంగాణా బిల్లు భవిత ఆధారపడివుంటుందని అన్నారు ముఖ్యమంత్రి.  వోటింగ్ జరిగిన తర్వాతనే రాష్ట్రపతి ఆ అంశాలను పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది కాబట్టి శాసన సభలో బిల్లు మీద ప్రతి అంశం మీదా చర్చ జరగటం ముఖ్యమని అన్న ముఖ్యమంత్రి మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ క్రింది వివరాలను కూడా ఇచ్చారు. 

1. విభజన వలన రెండు రాష్ట్రాలకూ నష్టమే జరుగుతుంది.

2. కాంగ్రెస్ కి ఇక భవిష్యత్తు లేదని అనటం సరైనది కాదని, జనవరి 23 తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతికి పంపిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తాం.  దాని గురించి 23 రోజుల ప్రత్యేక సమావేశం జరుగుతుంది.

3. పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాటలకు పరిణితి లేదు.

4. విభజన జరిగితే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది.

5. విభజన జరిగితే సంక్షేమ పథకాలకు నిదులుండవు.

6. శ్రీధరబాబు రాజీనామా అందింది.

7. ప్రాణహిత చేవెళ్ళకు 38 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో చిత్తూరుకి 6 వేల కోట్ల రూపాయలు ఇస్తే అది తప్పు అవదు.

8. వందలాది ఫైళ్లు సిఎం కార్యాలయంలో క్లియర్ అవుతూవుంటాయి.  వాటి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆధారాలు లేకుండా ఆ ఆరోపణలు నిలవవు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles