Banks may go for partial closing of atms at night

Indian Banks Association,Confederation of ATM Industry,Bank of IndiaATM,banks,RBI,ATMs,Bangalore ATM Attack

Banks may go for partial shutdown of ATMs with low transactions as a security measure from next month.

ఏటీఎంలు రాత్రి వేళల్లో బంద్

Posted: 12/30/2013 03:27 PM IST
Banks may go for partial closing of atms at night

ఏటీఎం... ఎనీ టైం మనీ... రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎంలు ఇక రాత్రి వేళల్లో మూత పడనున్నాయి. వచ్చే ఏడాది అనగా 2014 జనవరి నుండి రాత్రి వేళల్లో బ్యాంకులు మూసి వేయాలని ఇండియన్ బ్యాంకింగ్ అసోషియేషన్ నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఆర్ బీఐ ఇండియన్ బ్యాంకింగ్ అసోషియేషన్ కి ఓ లేఖ రాశాయి.

ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఇటీవల బెంగుళూరులో ఓ దుండగడు ఏటీఎం సెంటర్లో మహిళ పై దాడి చేసిన సంఘటనతో ఏటీఎంలలో భద్రత కరువు అనే విషయం తేట తెల్లడం కావడం, వీటి సంరక్షణ భారాన్ని మేం మోయలేమని, ప్రతి లావాదేవి జరిపినప్పుడు వినియోగ దారుడు నుండి ఛార్జి వసూలు చేస్తేనే వాటి నిర్వహణ బాధ్యత తీసుకుంటామని బ్యాంకులు చెప్పడంతో వినియోగదారులు సదురు ఏటీఎం బ్యాంకుల పై అసహనం వ్యక్తం చేశారు.

దీంతో ఇండియన్ బ్యాంక్ అసోషియేషన్ సంఘం రాత్రి వేళల్లో ఏటీఎంలు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకుల లేఖ పై ఆర్ బీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles