Fire accident at musheerabad timber depot

Fire Accident in musheerabad Timber depot, Musheerabad Timber depot Fire Accident, Musheerabad

Musheerabad Timber depot Fire Accident, Fire Accident in musheerabad Timber depot

ముషీరాబాద్ లో అగ్ని ప్రమాదం

Posted: 12/30/2013 09:19 AM IST
Fire accident at musheerabad timber depot

సికింద్రాబాద్ సమీపంలోని ముషీరాబాద్ లో ఓ కలప డిపోలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో డిపోలోని కలప మొత్తం అంటుకొని భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మంటలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కలకు మంటలు వ్యాపించాయి. దాదాపు రెండు గంటలకు పైగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ అదుపులోకి రాకపోవడంతో చుట్టు పక్కలవారు భయభ్రాంతులకు గురువుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

గతంలో కూడా ఇదే టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం సంబవించిన సమయంలో  టింబర్ డిపోను తరణించాలని స్థానికులు కోరినా అధికారులు పట్టించుకోలేదని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ప్రమాదం సంబవించడానికి గల కారణాలు తెలియరాలేదు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles