Ap assembly adjourned to jan 2

Andhra assembly, Assembly adjourned, Telangana bill, Telangana bill debate, assembly session, winter session, Seemandhra Rayalaseema, coastal Andhra, Telangana state, YSR Congress, Jan 3 2014.

Andhra Pradesh assembly, which will now meet again Jan 3 for the second leg of the winter session.

ఏమి తేల్చకుండా ఏయేటి సమావేశాలు ముగించారు

Posted: 12/19/2013 03:31 PM IST
Ap assembly adjourned to jan 2

రాష్ట్ర శాసనసభ ఈ ఏటి సమావేశాలకు మంగళం పాడేశారు. ఏదో ఇరగదీస్తారు... ఏదో చర్చిస్తారనుకుంటే అవేమి చేయకుండానే కోట్లు ఖర్చుచేసి అసెంబ్లీలో గోల గోల చేసి నేటితో సమావేశాలను ముగించారు. తెలంగాణ బిల్లు పై అసెంబ్లీలో చర్చిస్తారనుకుంటే దాని గురించి మాటత్తితేనే అంతెత్తున ఎగిరి నానా రభస చేసి చివరికి సమావేశాలను వాయిదా పడేలా చేశారు.

నేడు ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశం సజావుగా సాగనీయకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాలను వచ్చేసంవత్సరం వరకు వాయిదా వేశారు. మలి దఫా సమావేశాలను 2014 జనవరి 3 తేదీ నుండి 23 వ తేదీ వరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి దశ సమావేశాలు జనవరి 3 నుండి 10 తేదీ వరకు , రెండవ దశ సమావేశాలు 16 నుండి 23  వరకు నిర్వహించే షెడ్యూల్ ని ప్రకటించారు. ఈ పదమూడు రోజుల్లో (5, 18,19) తేదీలు సెలవు దినాలు ఉన్నాయి.

అదే విధంగా శాసన మండలిని కూడా జనవరి 3 వరకు వాయిదా వేస్తున్నట్లు శాసనమండలి ఛైర్మెన్ చక్రపాణి ప్రకటన చేశారు. తెలంగాణ అంశం పై ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు ఆందోళన కొనసాగించడంతో మండలి కూడా వాయిదాల పర్వం కొనసాగింది. మొత్తానికి ఇన్ని రోజులు కొట్లాటలు, లొల్లి లొల్లిల మధ్య సమావేశాలను ముగించారని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles