Telangana bill sent to president office

Telangana bill sent to president office, telangana bill, Rashtrapati Bhavan, Pranab Mukherjee, Andhra Pradesh bifurcation

The central government Friday sent to President Pranab Mukherjee the draft bill for formation of separate Telangana state.

రాష్ట్రపతి కార్యాలనికి చేరిన టి.బిల్లు

Posted: 12/06/2013 09:56 PM IST
Telangana bill sent to president office

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరిస్తుంది. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న ఆప్షన్ తెలంగాణ ఇవ్వడమే అని భావించి, కేంద్ర కేబినెట్ నిన్న సాయంత్రం పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును ఇంతకు ముందే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపింది.

మొదట అన్న ప్రకారమే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే టి బిల్లు సభలో ప్రవేశపెడతామని చెప్పిన కాంగ్రెస్ అన్నంత పని చేసింది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటానికి సమయం సరిపోకపోతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్రపతి కార్యాలయం నుండి నేరుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రానుంది. శాసనసభలో ప్రవేశ పెట్టిన తరువాత దీని పై ఓటింగ్ ఉంటుందా ? లేదా అన్న మీమాంస నెలకొంది. రాష్ట్రపతి శాసన సభకు ఎంత సమయం ఇస్తారన్నది ఇక్కడ ఆసక్తికర విషయం.

రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు తమ వద్ద రెండు వ్యూహాలున్నాయని చెప్పారు. ఉమ్మడి రాజధానిగా అంగీకరించిన కేసీఆర్‌కు శాంతిభద్రతలు గవర్నర్‌కు ఇవ్వడంపై ఆయనకు అభ్యంతరమం ఏమిటని ప్రశ్నించారు. బిల్లుపై చర్చ సమయంలో అందరూ అభిప్రాయాలు తెలపవచ్చని, అవసరమైనవాటిని బిల్లులో చేర్చే అవకాశం ఉంటుందని దిగ్విజయ్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles