Trs party dont want form telangana state says d k aruna

trs party dont want form telangana state says d-k aruna, telangana state says d-k aruna, telangana state, trs party, bjp, tdp, 2014 election,

trs party dont want form telangana state says d-k aruna

తెలంగాణ రావడం ఇష్టం లేదు: డీకే అరుణ

Posted: 12/06/2013 12:49 PM IST
Trs party dont want form telangana state says d k aruna

రాష్ట్ర విభజన పై కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఆనందంగా ఉన్నారు. కానీ తెలంగాణ రావడం ఇష్టం లేని వారిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తించారు. తెలంగాణ రావటం ఇష్టంలేని పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా గుర్తించారు.. రాష్ట్ర మంత్రి డి.కె. అరుణ. కేసిఆర్ కు తెలంగాణ రావటం ఇష్టలేదని గతంలో బీజేపి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న విషయం తెలిసిందే. ఈరోజు డీకే అరుణ కూడా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రావడం ఇష్టంలేదని చెబుతుంది. అంతేకాకుండా 2014లోపు తెలంగాణ ఏర్పాటు ఖాయమని రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ జోస్యం చెప్పారు.

 

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అరుణ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు దాదాపుగా పూర్తి అయింది, ఈ నేపథ్యంలో సహకరించాలని ఆమె సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకే చిన్న చిన్న సాకులను చూపి ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు.

 

ఇక తెలంగాణ రాష్ట్రం వస్తుంది కాబట్టి .. ఇక మిగిలింది టీఆర్ఎస్ పార్టీ విలీనమే అని అన్నారు. ఎంత త్వరగా టిఆర్ఎస్ పార్టీనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అంత మంచిదని ఆమె అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణరాష్ట్రం ఏర్పడబోతుందన్న ఆనందం కన్నా, పార్టీని కాంగ్రెస్ చేతిలో పెడుతున్నందుకు చాలా బాధపడుతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుల మద్య పోటీ తీవ్రంగా ఉంటుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles