Mla jayasudha continues in politics

MLA jayasudha continues in politics, MLA jayasudha, Dr.Jayasudha Kapoor MLA secunderabad, congress party, secunderabad MLA

MLA jayasudha continues in politics, MLA jayasudha, Dr.Jayasudha Kapoor MLA secunderabad, congress party, secunderabad MLA

నేను రాజకీయాల్లోనే ఉంటా ... మళ్లీ పోటీ చేస్తా...

Posted: 11/25/2013 10:08 AM IST
Mla jayasudha continues in politics

ఒక్కసారి రక్తం రుచి మరిగిన పులి వేటాడటం మానేస్తుందా ? అదే విధంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి వాటి రుచి చూసిన రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకున్న సంఘటనలు చాలా తక్కువ. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడారు. కానీ అలా చేయకపోగా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రముఖనటి, రాజకీయ నాయకురాలు అయిన జయ సుధ గతంలో తాను రాజకీయాల్లోనుండి తప్పుకుంటానని ప్రకటించారు.

కానీ మళ్లీ ఇప్పుడు మాట మార్చి తాను రాజకీయాల్లోనే కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పడమే కాకుండా, ప్రస్తుతం ప్రాతినిథ్యం వసిస్తున్న సికింద్రాబాద్ నుంచే పోటీచేయాలని ఆమె భావిస్తున్నారు. ఈ విషయం స్వయంగా ఆమె చెబుతూ అదిష్టానం ఏదైనా వేరే బాధ్యత అప్పగిస్తే తప్ప సికింద్రాబాద్ నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తనపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, వారు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా స్పందిస్తానని హెచ్చరించారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఉంటే తట్టుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles