Former minister mopidevei venkataramana gets bail

Former Minister Mopidevei Venkataramana, Mopidevi Venkata ramana, Mopidevi, CBI,Mopidevi gets bail,

Former Minister Mopidevei Venkataramana, an accused in the Vanpic aspect of quid pro quo investments case against YSR Congress Party chief Y.S. Jagan Mohan Reddy, was granted bail by a special CBI court on Monday.

మోపిదేవికి బెయిల్ వచ్చింది

Posted: 10/28/2013 12:34 PM IST
Former minister mopidevei venkataramana gets bail

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో గత ఏడాది మే 25 తేదీన అరెస్టు అయిన మోపిదేవి వెంకటరమణకు బెయిల్ మంజూరు అయింది. జగన్ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి కావడంతో జగన్ తో పాటు ఆ కేసులో అరెస్టు అయిన పలువురు ఇఫ్పటికే బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మోపిదేవికి కూడా నాంపల్లి సీబీఐ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది.  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తి అయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని  మోపిదేవి వెంకటరమణారావు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలవరించింది.

మొన్నటి వరకు అనారోగ్యం కారణంగా 45 రోజుల తాత్కాలిక బెయిల్ పై చికిత్స పొందిన వెంకట రమణ ఈనెల 25 తేదీన మళ్ళీ కోర్టులో లొంగిపోయారు. నేడు బెయిల్ మంజూరు కావడంతో ఆయన రేపు విడుదల కానున్నారు. దీంతో జగన్ కేసులో అరెస్టు అయిన వారు దాదాపు బయటకి వచ్చినట్లే.

జగన్ ని మొదలు కొని వెంకట రమణ వరకు ఒక్కొక్కరికి బెయిల్ ఇవ్వడం పై ప్రతిపక్షాలు కాంగ్రెస్ వారి కనుసన్నల్లోనే సీబీఐ బెయిల్ ఇస్తుందని ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles