Ou jac students attack ysrcp meeting on lb stadium

OU JAC students attack YSRCP meeting on LB stadium , YSR Congress Party leader Jagan Mohan Reddy, Public Meeting at LB Stadium, YSRCP Samaikyandhra Sankharavam Sabha, Jagans Samaikya Sankharavam

OU JAC students attack YSRCP meeting on LB stadium

స్టేడియంలో జనం- మంటల్లో జెండాలు

Posted: 10/26/2013 03:43 PM IST
Ou jac students attack ysrcp meeting on lb stadium

హైదరాబాద్ నడిబొడ్డు ఈరోజు సమైక్యాంద్ర కోసం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం సభ జరుగుతుంది. అయితే సీమాంద్ర ప్రాంతాల నుండి సమైక్య శంఖారావం సభకు వేలమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలిరావటం జరిగింది. ఇప్పటికే నగరం మొత్తం వైసీపీ జెండాలతోను, వైసీపీ కార్యకర్తలతో నిండిపోయింది. హైదరాబాద్ మొత్తం వైసీపీ కార్యకర్తలతో సందడిగా మారిపోయింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం పై.. తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొన్ని చోట్లు జగన్ సభకు వస్తున్న సీమాంద్ర బస్సులను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.

 

నగరంలో సమైక్య శంఖారాం సభను అడ్డుకునేందుకు ఓయూ విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. అయితే వీరిని ఓయ ఎన్ సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు , పోలీసు బలగాల మద్య ఉద్రిక్తత నెలకొంది. ఓయూ విద్యార్థులు రెచ్చిపోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను తగులబెట్టారు. విద్యార్థులు భారీ సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు.

 

అయితే ఎల్బీ స్టేడియం నిండి జనసముహంతో నిండిపోయింది. వైసీపీ నాయకులు సభలో ఉద్వేకంతో మాట్లాడుతున్నారు. కానీ ఓయూలు మాత్రం వైసీపీ జెండాలకు నిప్పు అంటించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles