Joint capital for 10 years no give 3 years kodandaram

joint capital for 10 years no? give 3 years kodandaram, professor M Kodandaram Reddy, Osmania University professor M Kodandaram Reddy, Hyderabad joint capital, Prof Kodandaram

joint capital for 10 years no? give 3 years kodandaram

10వద్దు .. మూడు ఇవ్వండి : కోదండరామ్

Posted: 10/19/2013 03:18 PM IST
Joint capital for 10 years no give 3 years kodandaram

‘‘ఇద్దరు వద్దు... ఒక్కరు ముద్దు..’’ అనే క్యప్చాన్ ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ 10 వద్దు.. మూడు ఇవ్వండి అనేది తెలంగాణ జేఏసీ కోదండరామ్ క్యప్చాన్. మొన్నటి వరకు.. సీమాంద్రలో సమైక్యాంద్ర ఉద్యమాకారులు.. ‘‘ విభజన వద్దురా.. సమైక్యం ముద్దురా ’’ అనే క్యప్చాన్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే సరికొత్తగా తెలంగాణ జేఏసీ కోదండరామ్ మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర విభజన పై కేంద్రం వేగం పెంచిన విషయం తెలిసిందే.

 

హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా అంగీకరించమని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. మంత్రుల బృందానికి ఇచ్చిన నివేదికపై టీజేఏసీ ఈరోజు సమావేశమై చర్చించింది. కోదండరామ్ మాట్లాడుతూ మూడేళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు వీల్లేదన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నీటి పంపిణీ జరగాలన్నారు.

 

ప్రత్యేక రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని కోదండరాం వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాలకు కల్పించే అన్నిహక్కులను తెలంగాణకు కల్పించాలన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని వనరుల వినియోగానికి సంపూర్ణ అధికారం తెలంగాణకు ఉండాలన్నారు. తెలంగాణ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు. విభజనకు 371డీ ఆర్టికల్‌ అడ్డురాదని ఉద్యోగ సంఘాల టీజేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు.

 

అయిన కోదండరామ్ గారు.. మీరు ఒక ప్రొఫెసర్ హోదాలో ఉండి.. గొంతమ్మ కోరికలు కోరటం మంచిదికాదు. ఇరుప్రాంత ప్రజల ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతేగానీ, రాష్ట్ర విభజన జరిగే సమయంలో ఇలాంటి డిమాండ్లు పెడితే.. తెలంగాణ విభజన ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles