Controversy over mla labbi venkataswamy wedding

Controversy over MLA Labbi Venkataswamy wedding, Controversy on MLA Labbi Venkataswamy marriage, Nandikotkur MLA Labbi Venkataswamy marriage,

Controversy over MLA Labbi Venkataswamy wedding, Controversy on MLA Labbi Venkataswamy marriage

వితంతువుతో ఎమ్మెల్యే ఏడడుగులు..

Posted: 10/19/2013 10:29 AM IST
Controversy over mla labbi venkataswamy wedding

ఆమె జీవితంలో ఎమ్మెల్యే ఏడడుగులు వేసి.. అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం లో అంత గొప్ప ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అప్పటికే ఆమె జీవితంలో.. చీకటితో నిండిపోయింది. అలాంటి ఆమె జీవితంలో ఎమ్మెల్యే వెలుగులు నింపాడు. అవినీతి, కుంభకోణాల, సెక్స్ రాకెట్ లాంటి వివాదాల్లో చిక్కుతున్న రాజకీయ నాయకులను చూశాం. పది మందికి ఆదర్శంగా నిలబడిన ఎమ్మెల్యేగా నందికొట్కురు లబ్బి వెంకటస్వామి పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు మాష్టర్ చెప్పిన మాటలు ఈ రోజు నిజం అయ్యినట్లు అనిపిస్తుంది. కందూకూరి వీరేశలింగం పంతులుగారు మాటలన్నమాట. అసలు ఇంతకి ఎమ్మెల్యే చేసిన సాహసం ఏమిటో తెలుసా. సామాజం సైతం .. ఇలాంటి మహిళలను దూరంగా పెడతారు. సొంతవారు కూడా ఇలాంటి మహిళకు ప్రాదాన్యత ఇవ్వరు. అలాంటిది ఒక ప్రజా నాయకుడి హోదాల ఉండి సామాజానికే ఆదర్శంగా నిలిచాడు. ఎమ్మెల్యే చేసిన సాహసం .. ఒక వితంతువుతో వివాహం చేసుకొని ఆమె ఏడడుగులు వేసి, తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.

 

చిన్నతంలోనే బాల్య వివాహం జరగటం.. యుక్త వయసు వచ్చే నాటికి వితంతువుగా మారటం ఆనాటి సమాజం లో జరిగిన సత్యలు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేసి, బాల్య వివాహాలను నిర్మూలించి, వితంతువులకు పెళ్లి చేసిన ఘనత మన కందూకూరి వీరేశలింగం పంతులుగారికే దక్కింది. ఈరోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు అని నిరూపించాడు నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి.

 

వింతతువును వివాహం చేసుకున్న ఎమ్మెల్యే అందరికీ ఆదర్శంగా నిలిచారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఓ వింతతువును వివాహం చేసుకున్నారు. నిన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి వధూవరుల కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.

 

ఏమైన ఎమ్మెల్యే చేసిన పనికి అందరు మెచ్చుకోవాలి. ఎందుకంటే.. ఈరోజుల్లో కాళ్ల పారణి ఆరకముందే.. భార్యను చంపుతున్న మగవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వితంతువు అంటేనే హీనంగా చూసే ఈ రోజుల్లో.. ఒక వితంతువు జీవితంలో వెలుగునింపటం అనేది.. నేటి యువతకు సాద్యం కాదు. ఇది కంప్యూటర్ యుగం .. కలిశామా... కాసేపు ఎంజాయ్ చేశామా.. చివరకు విడిపోయమా అనేది నేటి ఫ్యాషన్. ఇష్టం ఉంటే డేటింగ్ చెయ్యి.. లేకపోత.. డైవర్స్ ఇచ్చేయ్ .. అంతే జీవితం. నచ్చితే.. నాలుగు నవ్వులు.. నాలుగు గోడల మద్య నిషారాత్రులు అనేది నేటి యువతకు బాగా తెలిసిన ఫార్ములా. ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి చేసిన పని పై రాజకీయ నాయకులు కొన్నివిచిత్రమైన కామెంట్లు చేసిన ఆశ్చర్యంలేదు, ఒకవేళ ఎమ్మెల్యే స్వార్థం కోసమే ఆమె పెళ్లి చేసుకోని ఉండొచ్చుఅని కొంత మంది అంటారు. ఏదీ ఏమైన .. ఒక వితంతువును పెళ్లి చేసుకోవటం అనేది మాత్రం గొప్ప విషయమే అని ఆయన నియోజక వర్గంలో మహిళులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles