Cine industry pays tributes to srihari

Cine Industry Pays Tributes to Srihari, Actor Srihari dies in Mumbai, Actor Srihari Passed Away, Chiranjeevi pays condolences to Srihari

Cine Industry Pays Tributes to Srihari, Actor Srihari dies in Mumbai, Actor Srihari Passed Away

శ్రీహరన్నకు ఘననివాళి..

Posted: 10/10/2013 11:05 AM IST
Cine industry pays tributes to srihari

సినీ నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరింది. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. శ్రీహరి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ఆయన కుమార్తె అక్షర అంత్యక్రియలు కూడా అదే వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించటం జరిగింది. హిందీ చిత్రం రాంబో రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొన్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను అక్కడే లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచిన విషయం .

 

సినీ నటుడు శ్రీహరి మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన నివాసం జూబ్లిహిల్స్ కు చేరుకుని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు, దర్శకేంద్రుడు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు, జగపతిబాబు, ఎల్బీ శ్రీరాం, నిర్మాత సి. కళ్యాణ్, నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని, తదితరులు నివాళులు అర్పించారు. శ్రీహరి పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles