Dileep kumar and vimalakka not invited

Telangana Sakalajanula Bheri, Vimalakka, Dileep Kumar, KCR, KTR, Harish Rao, Sakalajanula Bheri Nizam College grounds, Telangana formation delayed

dileep kumar and vimalakka not invited to Sakalajanula Bheri

సకలజనుల భేరిలో చేర్చుకోని వారి ఆవేదన

Posted: 09/29/2013 05:35 PM IST
Dileep kumar and vimalakka not invited

తెలంగాణా రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఈ రోజు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సకలజనుల భేరి కార్యక్రమంలో తెరాస శ్రేణులు, ఉద్యోగ సంఘాలు వేలాదిగా తరిలివచ్చారు.  తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, ర్యాలీగా హరీష్ రావు, కెటిఆర్ లు వేదికకు చేరుకున్నారు.  కానీ తమను ఆహ్వానించలేదని అలిగిన వారు ఇద్దరున్నారు.    
వాళ్ళే ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు విమలక్క.  
తెలంగాణా ఉద్యమేమీ కెసిఆర్ కోదండరామ్ ల సొత్తుకాదన్నారు దిలీప్ కుమార్.  ఈ రోజు సకల జనుల భేరిలో తమనెందుకు పిలవలేదో చెప్పాలన్న దిలీప్ కుమార్ ఢిల్లీ పెద్దలతో భేటీకీ తన అవసరం వచ్చినప్పుడు మాత్రమే తనను సంప్రదిస్తారా అని అడిగారు.  అలాగే మిలియన్ మార్చ్ సందర్భంలో విమలక్క అవసరం పడింది.  ఆ సంగతి కూడా మర్చిపోయారని అన్నారాయన.   
తెలంగాణా బిల్లు పెట్టటంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న నాన్చుడు విధానం వలన ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు బాగా పెరుగుతున్నాయని దిలీప్ కుమార్ అన్నారు.  
తెలంగాణా కోసం అందరూ కలిసి ఉద్యమించాలని చెప్పిన వాళ్ళే ఇలా సకల జనుల భేరీకి తనను పిలవనందుకు విమలక్క అభ్యంతరం తెలిపారు.  దీనివలన రాబోయే తెలంగాణా మళ్లీ ఒకసారి దొరల తెలంగాణా అవుతుందా అని ఆమె ప్రశ్నించారు.  సామాజిక తెలంగాణా కోసం అందరూ నడుం బిగించాలని కూడా విమలక్క తెలంగాణా ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.  
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles