Kodandaram praises bjp efforts

kodandaram praises BJP efforts, Telangana JAC Kodandaram, BJP Sushma Swaraj, TDP Chandrababu Naidu, Shamshabad Novatel hotel

kodandaram praises BJP efforts

భాజపా కృషిని పొగిడిన కోదండరామ్

Posted: 09/29/2013 11:11 AM IST
Kodandaram praises bjp efforts

తెలంగాణా రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఈ రోజు తెలంగాణా ప్రకటన విషయంలో భారతీయ జనతా పార్టీ కృషిని శ్లాఘించారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణా పక్షంలో నిర్ణయం తీసుకుందంటే అందుకు భాజపా ఒత్తిడి కూడా కారణమేనంటూ కోదండరామ్ వ్యాఖ్యానించారు.

నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన భాజపా నేత సుష్మా స్వరాజ్ తమ పార్టీ యు టర్న్ తీసుకోబోదని, తెలంగాణాకు కట్టుబడివుంటామని చెప్పారు.  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భాజపా అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో కలవటం జరగలేదని ఆమె మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పారు. 

సుష్మా స్వరాజ్ ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నోవాటెల్ హోటల్లో కలిసిన కోదండరామ్, భాజపా తెలంగాణా ప్రజలకు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతగా మర్యాద పూర్వకంగా కలవటమే జరిగిందని, తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటంలో తంతుని వేగం చెయ్యవలసిందిగా కాంగ్రెస్ పార్టీని కోరమని, ఒత్తిడి కూడా తెమ్మని కోరటానికే సుష్మా స్వరాజ్ తో కలవటం జరిగిందని చెప్పారు.  భాజపా నేతలతో భేటీ అవటంలో రాజకీయమైన మరెటువంటి ఉద్దేశ్యమూ లేదు సుమా అన్న సంకేతాన్నివ్వటానికే కోదండరామ్ వివరణనిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles