13 dead in navy yard shooting

us navy yard, us shooting, gunman killed, washington navy yard, united states

A former Navy reservist went on a shooting rampage on Monday inside a building at the heavily secured Washington Navy Yard.

నేవీ యార్డ్ లో కాల్పులు...12 మంది దుర్మరణం

Posted: 09/17/2013 09:35 AM IST
13 dead in navy yard shooting

అగ్ర రాజ్యం అమెరికాలో ఎంత పటిష్టమైన  భద్రత ఉన్నా, దుండగలు, అగంతకులు  మాత్రం పెట్రేగి పోతున్నారు. . గతంలో పలు సంఘటనల్లో దుండగలు  దాడి చేసి పలువురి చిన్నారులను  పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు  ఉండే నివాస సమీపంలోని  నేవీ యార్డ్ లో దుండగలు  కాల్పులు  జరిపి నేవీ అధికారులనే  కాకుండా, 12 మంది సాధారణ  పౌరులను  పొట్టన పెట్టుకున్నారు..  ‘నేవల్ సీ సిస్టమ్స్ కమాండ్  ప్రధాన కార్యాలయంలో  ఈ ఘటన జరిగింది .  నావీ యార్డ్ లోకి ముగ్గురు దుండగలు  సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారు.. తీవ్ర స్థాయిలో కాల్పులు జరిపిన దుండగలు  12 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటనలో పలువురు గాయాల పాలయ్యారు . భద్రతా సిబ్బంది  అగంతకుల్లో ఒకర్ని పట్టుకొని  కాల్చి చంపారు. మరో ఇద్దరు పారిపోయినట్లు  పోలీసులు చెబుతున్నారు. . ఈ యార్డ్ లో 3 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. . వారు నౌకా దళానికి అవసరమైన  జలాంర్గాములు, నౌకల నిర్మాణం, నిర్వహణ విధులను నిర్వహిస్తుంటారు. ఈ సఘటన పై స్పందించిన అధ్యక్షుడు ఒబామా ఇది పిరికిపందల చర్య అని,తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles